
సీటీస్కాన్..ప్రాణాపాయం తప్పించింది!
జనగామ: జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కొత్తగా ప్రారంభమైన సీటీ స్కాన్ సేవలు ఓ ప్రాణాన్ని నిలబెట్టాయి. శనివారం ఉదయం ఓ వ్యక్తి పక్షవాతం లక్షణాలతో అత్యవసరంగా ఆసుపత్రికి రాగా, విధి నిర్వహణలో ఉన్న డాక్టర్లు తక్షణమే సీటీ స్కాన్ చేయించి ట్రీట్‌మెంట్ ప్రారంభించి యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం పా నుగంటి భిక్షపతి పక్షవాతంతో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. కుటుంబ సభ్యులు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చారు. డ్యూటీలో ఉన్న డాక్టర్, కల్నల్ భిక్షపతి స్పందించడంతో పాటు ఓపీ ప్రాసెస్ పూర్తిచేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజలింగం ఆదేశాల మేరకు సీటీస్కాన్ అప్రూవల్ తీసుకుని, దానిని కంప్లీట్ చేశారు. మరోవైపు డయాగ్నోసిస్‌కు సంబంధించి ప్రక్రియను 12 నిమిషాల వ్యవధిలో పూర్తిచేయడంతో పేషెంటు ఆరోగ్య పరిస్థితులు మరింత దిగజారిపోకుండా కాపాడగలిగారు. ప్రాణాపా యం నుంచి బయటపడిన ఆ వ్యక్తిని మరింత మెరుగైన వైద్యసేవల కోసం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి రెఫర్ చేశారు. వేగవంతమైన వైద్యం, ఆధునిక సౌకర్యాలను అందిపుచ్చుకుని డాక్టర్లు చేసిన సేవలను ప్రతి ఒక్కరు కొనియాడుతున్నారు. పేషెంటు వచ్చిన తర్వాత ఏ మాత్రం ఆలస్యం చేసినా పరిస్థితి విషమించేదని డాక్టర్ భిక్షపతి అన్నారు. ఆయన వెంట వైద్యులు, వైద్య సిబ్బంది ఉన్నారు.
బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వ్యక్తికి
వేగంగా చికిత్స
ఇటీవల ప్రారంభించిన సీటీస్కాన్
యంత్రంతో రోగనిర్ధారణ
12 నిమిషాల్లో ట్రీట్‌మెంట్
ప్రారంభించడంతో పరిస్థితి మెరుగు
జనగామ జిల్లా ఆసుపత్రిలో ఘటన