
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు
జనగామ రూరల్: పట్టణంలోని ఏబీవీ ప్రభు త్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 15,16 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లకు అవకాశం కల్పిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ కె.శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉన్నత విద్యా మండలి ద్వారా డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు కల్పించే దోస్త్ చివరి అవకాశం ఇచ్చిందని ఇంటర్ ఉత్తీర్ణత కలిగి డిగ్రీలో ప్రవేశం పొందనివారు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. స్పాట్ అడ్మిషన్ కోసం ఒరిజినల్స్ పదో తరగతి మెమో, ఇంటర్మీడియట్ మెమో కుల ధ్రువీకరణ, ఆదాయ ధ్రువీకరణ పత్రం, మూడో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు(2) వెంట తీసుకొని కళాశాలకు రావాలని ప్రిన్సిపాల్ తెలిపారు. మరిన్ని వివరాలకు 97010 46411, 99124 37032. నెంబర్లలో సంప్రదించాలన్నారు.
చీటకోడూరు తాగునీటిని శుద్ధిచేయండి
జనగామ: పట్టణ ప్రజలకు చీటకోడూరు రిజర్వాయర్ ఫిల్టర్ బెడ్ నుంచి నిత్యం సరఫరా చేసే తాగునీటి శుద్ధిలో లోపాలు ఉండడంతో ప్రజలు శాపంగా మారిందని అమ్మఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంతెన మణి శనివారం కమిషనర్ మహేశ్వర్‌రెడ్డికి లేఖ రాశారు. తాగునీరు రంగు మారి వస్తుండడంతో నిత్యావసరాలకు సైతం ఉపయోగించలేని విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. విధిలేని పరిస్థితుల్లో ఈ నీటిని వాడుకోవడం వల్ల చర్మ సంబంధిత వ్యాధులతో పాటు అనేక రోగాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మినరల్ వాటర్ కొనలేని దయనీయస్థితిలో నిరుపేద కుటుంబాలు రంగుమారిన నీటినే తాగుతున్నారన్నారు. ఫిల్టర్‌బెడ్ వద్ద నీటిని శుద్ధి చేసే సమయంలో నిబంధనలను పాటించాలని, లేని పక్షంలో ఆందోళన తప్పదని హెచ్చరించారు.
లింగాలఘణపురం: మండలంలోని మాణిక్యాపురానికి చెందిన ఒగ్గు రవిని శుక్రవారం రాత్రి విశాఖపట్నంలోని కళాభారతి ఆడిటోరియంలో వైశాఖీ యువ పురస్కారంతో సత్కరించారు. నటరాజ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో వైశాఖీ జాతీయ నృత్సోత్సవాలు ప్రారంభం కాగా 21 మంది ఒగ్గుడోలు బృందానికి ప్రత్యేక ఆహ్వానం అందగా అబ్బురపరిచే ప్రదర్శన చేశారు. అనంతరం ఒగ్గు రవిని వైశాఖీ యువ పురస్కారంతో సత్కరించారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఐఆర్‌ఎస్ రవిశంకర్ నారాయణ, రిటైర్డ్ ఆదాయ పన్ను శాఖ కమిషనర్ ఎస్.మహమ్మద్ అలీ, కళాభారతి నిర్వాహుకులు డాక్టర్ జీకేడీ ప్రసాద్, నటరాజ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ నిర్వహుకుడు విక్రమ్, ఆంధ్ర నాట్య కళాకారుడు కళాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
నర్మెట: మండలంలోని మచ్చుపహాడ్‌కు చెందిన ఫరీదుల లింగరాజుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇటీవల డాక్టరేట్ ప్రదానం చేసింది. డాక్టర్ హరీశ్ గుప్తా పర్యవేక్షణలో జియోకెమిస్ట్రీ విభాగంలో ఇండియన్ కోస్టల్ నదులపై చేసిన అధ్యయనానికిగాను లింగరాజు డాక్టరేట్ పొందారు. ఈసందర్భంగా తల్లితండ్రులు ఫరీదుల యాదయ్య–యాదమ్మలను మాజీ ప్రజాప్రతినిథులు, గ్రామస్థులు శనివారం అభినందించారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు