జిల్లాస్థాయి షూటింగ్‌బాల్‌ ఎంపిక పోటీలు | - | Sakshi
Sakshi News home page

జిల్లాస్థాయి షూటింగ్‌బాల్‌ ఎంపిక పోటీలు

Sep 15 2025 8:19 AM | Updated on Sep 15 2025 8:19 AM

జిల్ల

జిల్లాస్థాయి షూటింగ్‌బాల్‌ ఎంపిక పోటీలు

స్టేషన్‌ఘన్‌పూర్‌: డివిజన్‌ కేంద్రంలో జనగామ జిల్లాస్థాయి జూనియర్‌ బాలబాలికల షూటింగ్‌బాల్‌ ఎంపిక పోటీలను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా షూటింగ్‌బాల్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి అన్నెపు కుమార్‌ మాట్లాడారు.. జిల్లాస్థాయి జూనియర్‌ షూటింగ్‌బాల్‌ ఎంపిక పోటీలకు బాలురు 80 మంది, బాలికలు 70 మంది హాజరయ్యారన్నారు. ఎంపిక పోటీల్లో వారు చూపిన ప్రతిభ ఆధారంగా 12 మంది బాలురు, 12 మంది బాలికలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎంపికై న వారు ఈనెల 22, 23, 24వ తేదీలలో మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదుర్లలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో షూటింగ్‌బాల్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు యుగేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు దేవ్‌సింగ్‌, పీడీ గోపాలకృష్ణ, పీఈటీలు సుధాకర్‌, చందర్‌ తదితరులు పాల్గొన్నారు.

ముస్లింల ర్యాలీ

జనగామ రూరల్‌: మిలాద్‌ ఉన్‌ నబీ పండుగ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం మిలాద్‌ సోషల్‌ వెల్ఫేర్‌ కమిటీ అధ్యక్షుడు అన్వర్‌ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ముస్లింలు ర్యాలీ చేపట్టారు. గిర్నిగడ్డ, లేబర్‌ అడ్డా నుంచి బైక్‌పై ముస్లిం మైనారిటీ యువకులు ర్యాలీ ప్రారంభించి రెల్వేస్టేషన్‌ జామియా మజీద్‌ వరకు నిర్వహించారు. ర్యాలీలో సీఐ దామోదర్‌రెడ్డి, జిల్లా మైనార్టీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు జమాల్‌ షరీఫ్‌, మాజీ కౌన్సిలర్‌ సమద్‌, యువకులు, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.

సురక్షిత నీరు అందించాలి

జనగామ రూరల్‌: చీటకోడూరు రిజర్వాయర్‌లోని ఫిల్టర్‌ బెడ్లను ఆధునీకరించి పట్టణ ప్రజలకు సురక్షిత నీరందించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్‌ డిమాండ్‌ చేశారు. అదివారం మండల కమిటీ ఆధ్వర్యంలో ఫిల్టర్‌బెడ్‌ను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంబంధిత అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకొని పట్టణ ప్రజలందరికీ పరిశుభ్రమైన తాగునీటిని అందించాలని లేనిపక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి జగదీశ్‌, పట్టణ ఉపాధ్యక్షులు బింగి రమేశ్‌, హరిప్రసాద్‌, పట్టణ కార్యదర్శి శివకృష్ణ, జిల్లా కార్యదర్శి సతీశ్‌, బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు.

జాతీయ స్థాయి

కరాటే పోటీల్లో ప్రతిభ

జనగామ: హైదరాబాద్‌ బోడుప్పల్‌లో ఆదివారం నిర్వహించిన 29వ జాతీయ స్థాయి కరాటే పోటీల్లో జనగామ పట్టణంలోని విక్టరీ షోటోకాన్‌ కరాటే అకాడమీ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనభరచి పలు పతకాలు సాధించారని అకాడమీ జిల్లా అధ్యక్షుడు మాస్టర్‌ ఓరుగంటి సంతోష్‌కుమార్‌ తెలిపారు. అండర్‌ 14 బాలికల విభాగంలో మాట్ల జెస్సిక, అండర్‌ 8 బాలికల విభాగంలో చెన్నోజు అక్షయ, అండర్‌ 8 బాలుర విభాగంలో బండ శ్రీరామ్‌, మహేశ్వరం అశ్విత్‌చంద్‌ బంగారు పతకాలు గెలుచుకున్నారని తెలిపారు. అండర్‌ 14 బాలుర విభాగంలో బ్రౌన్‌ బెల్ట్‌ విభాగంలో ఓరుగంటి అక్షిత్‌ మణివర్ధన్‌, అండర్‌ 12 విభాగంలో ఓరుగంటి నిక్షిత్‌ మణివర్ధన్‌, మట్ల సామ్యేల్‌ జాన్‌ సిల్వ ర్‌ మెడల్‌ గెలుపొందగా, బాలికల కలర్‌ బెల్ట్స్‌ విభాగంలో హృతిక, ఆంధ్రగుండా వర్షిణి, బండ అవంతిక కాంస్య పతకాలు సాధించారని చెప్పారు. విక్టరీ షోటోకాన్‌ అకాడమీ ఇండియా చీఫ్‌ రంగు మల్లికార్జున్‌గౌడ్‌, సీనియర్లు మాస్టర్లు సదాశివుడు, బాబురావు, సురేశ్‌, గిద్దలూరు శ్రీనివాస్‌ పతకాలు గెలుపొందిన విద్యార్థులను అభినందించారు.

జిల్లాస్థాయి షూటింగ్‌బాల్‌ ఎంపిక పోటీలు
1
1/3

జిల్లాస్థాయి షూటింగ్‌బాల్‌ ఎంపిక పోటీలు

జిల్లాస్థాయి షూటింగ్‌బాల్‌ ఎంపిక పోటీలు
2
2/3

జిల్లాస్థాయి షూటింగ్‌బాల్‌ ఎంపిక పోటీలు

జిల్లాస్థాయి షూటింగ్‌బాల్‌ ఎంపిక పోటీలు
3
3/3

జిల్లాస్థాయి షూటింగ్‌బాల్‌ ఎంపిక పోటీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement