
రాజ్యాధికార దిశగా ఉద్యమించాలి
జనగామ రూరల్: గిరిజనులు రాజ్యాధికార దిశగా ఐక్యంగా ఉద్యమించాలని సేవాలాల్ సేన జాతీయ అధ్యక్షుడు చినబాబు నాయక్, రాష్ట్ర అధ్యక్షుడు ఆముగోత్ రాంబాబు పిలుపునిచ్చారు. అదివారం పట్టణంలోని ఎస్‌ఎస్‌ఎన్ గార్డెన్స్‌లో జిల్లా అధ్యక్షుడు ధరావత్ శంకర్ నాయక్ అధ్యక్షతన సేవాలాల్ సేన ఆవిర్భావ దశాబ్ది వేడుకలు నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ..బంజారా, సుగాలి, లంబాడీలకు రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు కల్పించబడ్డాయని కానీ కొందరు నాయకులు అవగాహన లేకుండా తప్పుదారి పట్టించే వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది జోగురాం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బానోతు మహేందర్, భూక్య రాజు, ధరావత్ రమేశ్, మూడవత్ రాజు, వాంకుడోత్ అనిత, భిక్షపతి పాల్గొన్నారు.