జనగామ: ప్రతీ ఇంటిలో సౌర విద్యుత్తును వినియోగించి కాలుష్య రహిత తెలంగాణగా మార్చుదామని విద్యుత్ శాఖ విశ్రాంత ఎస్‌ఈ నరేంద్ర కుమార్ పిలుపునిచ్చారు. కలెక్టరేట్ సమావేశం హాల్‌లో ఎన్‌పీడీసీఎల ఎస్‌ఈ టి.వేణుమాధవ్ అధ్యక్షతన రెండు రోజులుగా గృహ సౌర విద్యుత్‌పై జరుగుతున్న శిక్షణ తరగతులు శనివారం ముగిశాయి. అంతకుముందు ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం 2027మార్చిలోగా దేశంలో కోటి సౌర విద్యుత్ వినియోగదారులను తయారు చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తోందన్నారు. ఇందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని భావిస్తున్నామన్నారు. ఇంటిపై సౌర విద్యుత్ ప్యానెళ్లను అమర్చుకునే విధానంతో పాటు ఎలా దరఖాస్తు చేసుకోవాలనే దానిపై కేంద్రం విధి విధానాలు రూపొందించిందన్నారు. ముగింపు కార్యక్రమంలో జాతీయ విద్యుత్ శిక్షణా సంస్థ డిప్యూటీ డైరెక్టర్ వెంకట సుబ్బయ్య, విద్యుత్ శాఖ డీఈలు గణేశ్, రాంబాబు, లక్ష్మీనారాయణరెడ్డి, వివిధ సబ్ డివిజన్ల ఏడీఈ, ఏఈ, సబ్ ఇంజనీర్లు ఉన్నారు.
శిక్షణ తరగతుల్లో విశ్రాంత ఎస్‌ఈ నరేంద్ర కుమార్