
దరఖాస్తుల ఆహ్వానం
జనగామ రూరల్: స్వచ్ఛంద సంస్థలు కొత్త గ్రాంట్ ఇన్ ఎయిడ్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి డాక్టర్ బి.విక్రమ్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత మూడు సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్న ఎన్జీఓలు మాత్రమే సాంఘిక సంక్షేమ నిధి ఆర్థికసాయానికి అర్హులన్నారు. సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో ఈ నెల 22వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ఎంవీఐల ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ
జనగామ: జిల్లా కేంద్రం ఆర్టీసీ చౌరస్తా పోలీసు కంట్రోల్ రూం ఏరియాలో ట్రెయినీ మోటారు వెహికిల్ ఇన్‌స్పెక్టర్లు (ఎంవీఐ) సంపత్‌గౌడ్, మహేష్‌గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం తనిఖీలు చేపట్టారు. సీనియర్ ఎంవీఐలతో కోఆర్డినేషన్ చేసుకుంటూ 10 రోజుల వ్యవధిలో ఉన్నతాధికారుల టార్గెట్‌ను రీచ్ కావాల్సి ఉంటుంది. ఆర్డీఓ నియమ నిబంధనలు పాటించకుండా రోడ్డెక్కుతున్న ప్రతీ వాహనంపై కేసు నమోదు చేస్తున్నారు. శుక్రవారం ఒక్కరోజే 10 కేసులు నమోదు అయ్యాయి. వారి వెంట కానిస్టేబుల్ సమ్మద్, తదితరులు ఉన్నారు.
ప్రజా ఉద్యమాలతోనే
సమస్యల పరిష్కారం
జనగామ రూరల్: ప్రజా ఉద్యమాలతోనే సమస్యల పరిష్కారం అవుతాయని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని సీపీఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలో ఏ రొడ్డు చూసిన గుంతలతో ప్రమాదాలకు గురవుతున్నాయని, చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వీధిలైట్లు, ఉద్యోగుల సమయ పాలన, పారిశుద్ధ్యం, దోమలు స్వైరవిహారం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 17న తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవ ముగింపు సభకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఈర్రి అహల్య, రాపర్తి రాజు సింగారపు రమేష్, బొట్ల శేఖర్, పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్, జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి, సుంచు విజేందర్, భూక్య చందు, బెల్లంకొండ వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
యూరియా కోసం అవస్థలు
జఫర్‌గఢ్ : యూరియా కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. జఫర్‌గఢ్, స్టేషన్‌ఘన్‌పూర్ మండల కేంద్రాల్లోని సొసైటీతో పాటు మన గ్రోమోర్ షాపులకు శుక్రవారం యూరియా వచ్చిందని తెలుసుకున్న రైతులు తెల్లవారుజాము నుంచి బారులుదీరారు. గంటల కొద్ది లైన్‌లో నిరీక్షించిన కొందరి రైతులకు యూరి యా దొరకకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసి నిరాశతో వెనుదిరిగారు. సరిపడా యూరియా పంపిణీ చేయాలని రైతులు కోరుతున్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

దరఖాస్తుల ఆహ్వానం