
సౌర విద్యుత్‌తో ఆర్థికలాభం
జనగామ: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సౌర విద్యుత్ వినియోగంతో ఆర్థికంగా లబ్ధి చేకూరుతుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశం హాలులో పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజనపై విద్యుత్ శాఖ ఇంజనీర్లకు రెండు రోజుల శిక్షణ తరగతులను ప్రారంభించారు. రూరల్ ఎలక్ట్రికేషన్ కార్పొరేషన్ (ఆర్‌ఈసీ), జాతీయ విద్యుత్ శిక్షణా సంస్థ (ఎన్‌పీటీఐ), బెంగళూరు ఆధ్వర్యంలో డైరెక్టర్ వెంకటసుబ్బయ్య, విద్యుత్ శాఖ విశ్రాంత చీఫ్ ఇంజనీర్ దుర్గా ప్రసాద్, కలెక్టర్ రిజ్వాన్ బాషాలు ఎన్‌పీడీసీఎల్ శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు. అనంతరం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ టి.వేణుమాధవ్‌తో కలిసి కలెక్టర్ రిజ్వాన్ బాషా మాట్లాడుతూ విద్యుత్‌కు ప్రత్యామ్నాయంగా సౌర విద్యుత్‌ను ప్రోత్సహించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఇంటిపై కప్పుతో పాటు వ్యవసాయ భూముల్లో సౌర విద్యుత్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేసుకుని విద్యుత్ బిల్లులు ఆదా చేసుకోవచ్చన్నారు. జిల్లాలో 317 సౌర విద్యుత్ మీటర్ కనెక్షన్లు ఉన్నాయని, ఈ సంఖ్యను పెంచేందుకు అధికారులు, ఇంజనీర్లు కృషి చేయాలన్నారు. ఎస్‌ఈ వేణుమాధవ్ మాట్లాడుతూ సౌర విద్యుత్ ప్యానెళ్లకు ప్రభుత్వం సబ్సిడీ అందింస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఏఓ జయరాజ్, డీఈలు గణేష్, రాంబాబు, లక్ష్మినారాయణరెడ్డి, ఏడీఈలు, ఏఈలు, సెక్షన్ ఏఈలు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి కాల్ సెంటర్
జనగామ రూరల్: ఇందిరమ్మ ఇళ్ల పథకం మరింత పారదర్శకంగా అమలు చేసేందుకు ప్రభుత్వం కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేసిందని కలెక్టర్ రిజ్వాన్ బాషా శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందిరమ్మ లబ్ధిదారులు ఏమైన సమస్యలు ఉంటే 1800 599 5991 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటలకు అందుబాటులో ఉంటుందన్నారు.
జిల్లాలో 317 సౌర విద్యుత్ కనెక్షన్లు
సమీక్షలో కలెక్టర్ రిజ్వాన్ బాషా