
విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలి
పాలకుర్తి టౌన్: విద్యార్థులకు చదువుతోపాటు పాఠశాలల్లో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని అదనపు కలెక్టర్ పింకేశ్‌కుమార్ అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలోని ప్రాథమిక పాఠశాలను అదనపు కలెక్టర్ సందర్శించారు. జిల్లాలో మొదటిసారిగా ప్రారంభించనున్న ప్రీప్రైమరీ తరగతుల కోసం పాఠశాల తరగతి గదులను పరిశీలించారు. పాఠశాలలో లైబ్రరీ, టీఎల్‌ఎం సదుపాయాలను, కిచెన్, గార్డెన్, పరిసరాలను పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థులకు చదువుతో మంచి వాతారవణం, పరిశుభ్రత చాలా అద్భుతంగా ఉందని ప్రధానో పాధ్యాయడు చిదురాల శ్రీనివాస్‌ను అభినందించా రు. అనంతరం విద్యార్థులతో పాఠాలు చదివించి పఠన నైపుణ్యాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీపీఓ స్వరూప, ఏఎంఓ శ్రీనివాస్, ఎంపీడీఓ రవీందర్, ఎంఈఓ పోతుగంటి నర్సయ్య, సీఆర్‌పీలు కిషన్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.