
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
స్టేషన్‌ఘన్‌పూర్: ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డి ప్యూటీ డీఎంహెచ్‌ఓ సుధీర్ అన్నారు. ఇప్పగూడెం పీహెచ్‌సీ ఆధ్వర్యంలో మండలంలోని తానేదార్‌పల్లి గ్రామంలో శుక్రవారం హెల్త్‌క్యాంపు నిర్వహించారు. ఎంఎల్‌హెచ్‌పీ డాక్టర్ రమ్యకృష్ణ ఆధ్వర్యంలో ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్యులు, వైద్య సిబ్బందికి డిప్యూటీ డీఎంహెచ్‌ఓ పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌బీఎస్‌కే మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అజయ్‌కుమార్, ఏఎన్‌ఎం సునీత, ఆశ కార్యకర్తలు అనిత, స్వప్న తదితరులు పాల్గొన్నారు.
డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సుధీర్