
సుప్రీం తీర్పును సమీక్షించాలి
రెండేళ్లలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఉత్తీర్ణులు కావాలని, లేదంటే ఉద్యోగాన్ని వదులుకోవాలని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలి. ప్రస్తుతం పదోన్నతి పొందాలంటే టెట్ అవసరమా లేదా అనే వివాదంపై వివిధ కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఇరవై, పాతికేళ్లుగా సర్వీసు చేస్తున్న ఉపాధ్యాయులు ఇప్పుడు కేవలం రెండేళ్లలో టెట్ ఉత్తీర్ణులు కావాలనడం భావ్యం కాదు. ఎన్‌సీటీఈ నోటిఫికేషన్ తర్వాత నియామకమైన టీచర్లకు మాత్రమే టెట్ తప్పనిసరి చేయాలి.
– పి.చంద్రశేఖర్‌రావు, జిల్లా అధ్యక్షుడు, టీఎస్ యూటీఎఫ్