
పీఏసీఎస్ ఇన్‌చార్జ్‌లకు బాధ్యతల అప్పగింత
జనగామ: జిల్లాలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలకు అఫిషియల్ పర్సన్ ఇన్‌చార్జ్‌లను నియమించినట్లు జిల్లా సహకార అధికారి కోదండరాములు గురువారం చెప్పారు. లింగాలఘణపురం మండలం కళ్లెం సొసైటీ అఫిషియల్ పర్సన్ ఇన్‌చార్జ్‌గా వి.వేణుగోపాల్ (కోఆపరేటివ్ అసిస్టెంట్ రిజిష్ట్రార్), బచ్చన్నపేట సొసైటీ అఫిషి యల్ పర్సన్ ఇన్‌చార్జ్‌గా బి.దివ్య(కోఆపరేటివ్ అసిస్టెంట్ రిజిష్ట్రార్), రఘునాథపల్లి నిడిగొండ సొసైటీ అఫిషియల్ పర్సన్ ఇన్‌చార్జ్‌గా ఎన్.కొర్నేలియస్ (కోఆపరేటివ్ అసిస్టెంట్ రిజిష్ట్రార్)లకు బాధ్యతలను అప్పగించారు. జఫర్‌గడ్ సొసైటీకి సంబంధించిన నిర్ణయాన్ని పెండింగ్‌లో ఉంచారు.
జనగామ రూరల్: ఈనెల 13వ తేదీన జిల్లా కోర్టులో నిర్వహించే లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ గురువారం ఒక ప్రకటన తెలిపారు. ఇంతకు ముందు కోర్ట్ ముందుకు రాని కేసులు, కోర్ట్‌లో పెండింగ్‌లో ఉన్న కేసులు కానీ పరిష్కరించుకునే వీలు ఉంటుందన్నారు. లోక్ అదాలత్‌లో కేసు దాఖలు చేసినప్పుడు కోర్టు రుసుం చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, కుటుంబ తగాదా కేసులు, డబ్బు రికవరీకి సంబంధించిన కేసులు, మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు, చిట్‌ఫండ్ కేసులు, ఎలక్ట్రిసిటీ కేసులు, చెక్కు బౌన్‌న్స్ కేసులు పరిష్కరించుకోవచ్చుని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
● మున్సిపల్ కార్యాలయం ఎదుట ఎల్‌ఆర్‌ఎస్ కట్టిన బాధితుల ధర్నా
జనగామ రూరల్: ప్రభుత్వ నిబంధన ప్రకారం ఎల్‌ఆర్‌ఎస్ కట్టిన బాధిత ప్లాట్ ఓనర్లకు ఎల్‌ఆర్‌ఎస్ అప్రూవల్ ఆర్డర్ కాపీ ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం బాధితులతో కలిసి మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ..పట్టణంలోని 400 సర్వే నెంబర్ ఇళ్ల స్థలాల భూమిలో ఇందిరమ్మ ఇల్లు సాంక్షన్ అయ్యి పునాది లెవెల్ పూర్తి చేసిన గాజుల అంజలికి ఇందిరమ్మ ఇల్లు బిల్లు విడుదల చేయాలన్నారు. 2006 సంవత్సరంలో పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్ ఎండీ ఇబ్రహీం భూమిని ప్లాట్లు చేసి విక్రయించగా పేదలు, రిక్షా కార్మికులు, హమాలీ కార్మికులు తదితరులు కొనుక్కుని ఎవరి ఖబ్జా మీద వారు ఉన్నారన్నారు. ధర్మ కృష్ణారెడ్డి అనే భూస్వామి 383 సర్వే నెంబర్లు పట్టా కలిగి ఉండి అక్రమంగా 400 సర్వే నెంబర్ పట్టాలోకి చొరబడి పేదలను ఇబ్బంది పెడుతున్నాడని, ఈ విషయం 2024 సంవత్సరంలో జనగామ డీఐ సర్వే నిర్వహించి గెట్టు నిర్ణయించారని మున్సిపల్ అధికారులను తప్పుదారి పట్టించి పేదలను ఇబ్బంది పెడుతున్నాడన్నారు. తక్షణమే పేదలకు న్యాయం చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు ఇ ర్రి అహల్య, జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి, ఎండీ అజారుద్దీన్, భూక్య చందు, మీట్యానాయక్, బొట్ల శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.