మెనూ ప్రకారం భోజనం అందించాలి
జనగామ రూరల్: పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. గురువారం మండలంలోని చౌడారం మోడల్ స్కూల్, కేజీవీబీని గురువారం కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో ఎప్పటికప్పుడు పిచ్చి మొక్కలను తొలగించాలని, శానిటేషన్ నిర్వహించాలన్నారు. 10వ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు రావాలంటే ఇప్పటి నుంచే ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సుధీర్‌రెడ్డి, అనిత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు
భూభారతి దరఖాస్తులను
వేగంగా పరిష్కరించాలి
భూభారతి దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో భూభారతి, సాదాబైనామా, జాతీయ కుటుంబ లబ్ధి పథకం, ప్రజావాణి దరఖాస్తులపై అదనపు కలెక్టర్ బెన్షాలోమ్, ఆర్డీఓలు గోపిరామ్, వెంకన్నతో కలిసి తహసీల్దార్లలతో సమీక్షించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. భూ భారతి దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించడంలో తహసీల్దార్‌లు సందేహాలను నివృత్తి చేస్తూ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలన్నారు. యూరియా పంపిణీ సక్రమంగా జరిగే విధంగా విస్తృతంగా తనిఖీలు చేయాలని, రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు.
కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా


