
హోంలోన్‌కు బీమా వర్తించదంటున్నారు..
● ఫైనాన్స్ బ్యాంకు ఎదుట
పెట్రోల్ డబ్బాతో బాధితుల నిరసన
జనగామ: జిల్లా కేంద్రంలోని ఓ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు సంస్థ ఎదుట ఇద్దరు వ్యక్తులు గురువారం పెట్రోల్ డబ్బాతో నిరసన తెలిపారు. బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నర్మెటకు చెందిన కొలేపాక లక్ష్మయ్య అనే వ్యక్తి సదరు సంస్థలో రూ.8.50లక్షల హోంలోన్ తీసుకున్నాడు. రుణం ఇచ్చే సమయంలో ఆరోగ్య పరీక్షలు చేసి, బీమా కోసం రూ.30 వేలు తీసుకున్నారు. లక్షయ్య ఇటీవల మృతి చెందారు. లక్ష్మయ్య పేరిట బీమా చేసిన సమయంలో ఏదైనా జరిగితే లోన్‌కు సంబంధించిన ఫైనాన్స్ సంస్థకు ఒక్క రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదని నిర్వాహకులు చెప్పారని బాధితులు కన్నీరు మున్నీరుగా విలపించారు. గత నెల నుంచి బీమా వర్తించడం లేదని, లక్ష్మయ్య తీసుకున్న రుణం చెల్లించాలని సంస్థ ప్రతినిధులు బెదిరింపులకు దిగడంతో పెట్రోల్ డబ్బాతో నిరసన తెలిపామన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు చేరుకుని వారికి నచ్చజెప్పి పీఎస్‌కు తీసుకెళ్లారు.