
ఆ సొసైటీలకు షాక్!
ఇన్‌చార్జ్ పాలన నుంచి
‘ఆరోపణల పీఏసీఎస్’లు అవుట్
మూడు సొసైటీలకు అఫిషియల్ పర్సన్ ఇన్‌చార్జ్‌లు
సమగ్ర విచారణ జరుగుతోంది..
– కె.వెంకటరాములు, జిల్లా సహకార సొసైటీ అధికారి
జనగామ: అవినీతి, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ(పీఏసీఎస్)ల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రభుత్వం రెండోసారి పీఏసీఎస్‌ల పాలకమండళ్లకు గడువు పెంచగా, జిల్లాలో నాలుగింటికి బ్రేక్ వేసింది. ఇందులో మూడుచోట్ల అఫిషియల్ పర్సన్ ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగిస్తుండగా, ఒక సొసైటీ బాధ్యతలకు సంబంధించి పెండింగ్‌లో ఉంచింది. ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీ పీఏసీఎస్ పాలక మండళ్ల పదవీ కాలం ముగియగా, ఆరు నెలల పాటు పాలక వర్గం గడువు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతనెల ఆగస్టు 14వ తేదీన మొదటిసారి ఇచ్చిన గడువు ముగియడంతో పాలక మండళ్లకు మరో ఆరునెలల పాటు అవకాశం ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. గడువు ముగిసిన రెండు రోజుల్లో 10 పీఏసీఎస్‌లకు(ప్రస్తుతం ఉన్న పాలక మండళ్లు) అవకాశం ఇవ్వగా, నిధుల దుర్వినియోగం ఆరోపణలను ఎదుర్కొంటున్న నాలుగు సొసైటీల ఫైళ్లను పక్కనబెట్టింది.
జిల్లాలో పీఏసీఎస్‌లు 14 పనిచేస్తుండగా, ఇటీవల తాత్కాలిక ఇన్‌చార్జ్ పదవీకాలం ముగిసిన నేపథ్యంలో ప్రభుత్వం మరో ఆరు నెలల పాటు పొడిగించింది. ఈక్రమంలో 10 పీఏసీఎస్‌ల పరిధిలో ప్రస్తుత చైర్మన్‌న్‌లకే పర్సన్ ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించగా, జఫర్‌గడ్, నిడిగొండ, కళ్లెం, బచ్చన్నపేట సొసైటీలకు తాత్కాలిక బ్రేక్ వేసింది. ఇందుకు ప్రధాన కారణం ఆ నాలుగు సొసైటీల పరిధిలో కొన్నేళ్లుగా నిధుల దుర్వినియోగం, పంట రుణాల జారీలో అక్రమాలు, సొసైటీ స్థలాల ఆక్రమణలు, ఐకేపీ సెంటర్ల నుంచి వచ్చే కమీషన్ డబ్బులను మరో పనికి ఉపయోగించడం తదితర ఆరోపణలతో పెండింగ్‌లో ఉంచారు. ఈ నేపథ్యంలో సంబంధిత చైర్మన్‌న్‌లతో పాటు సీఈఓలకు ఇప్పటికే నోటీసులు జారీ చేయగా, సమగ్ర విచారణ, పోలీసులు కేసులు కొనసాగుతున్నాయి.
రఘునాథపల్లి మండలం నిడిగొండ, బచ్చన్నపేట, లింగాలఘనపురం మండలం కళ్లెం, జఫర్‌గడ్ పీఏసీఎస్ పరిధిలో అధికారుల విచారణలో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. కళ్లెం, నిడిగొండ, కంచనపల్లి తదితర పీఏసీఎస్‌ల్లో బినామీ పేర్లతో పంట రుణాలు తీసుకున్నట్లు అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఆడిటింగ్ జరుగకుండా చేసి, పెద్ద ఎ త్తున నిధులను గోల్‌మాల్ చేయగా, అప్పట్లో సాక్షి వరుస కథనాలు ప్రచురించగా, ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. కళ్లెం సొసైటీలో 15 గుంటల భూమిని ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ చేయగా, ధాన్యం కొనుగోలు సెంటర్ల నుంచి వచ్చిన కమీషన్ డబ్బులను సైతం పక్కదారి పట్టించారు. జఫర్‌గడ్‌లో ఆడిట్, ఫర్టిలైజర్ అమ్మకాలకు సంబంధించి నగదు విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. బచ్చన్నపేట పీఏసీఎస్ సైతం నిధుల అక్రమాలు, కమీషన్ డబ్బులు, ఆడిట్ తదితర వాటికి సంబంధించి లెక్క తేలాల్సి ఉంది. నిడిగొండ సొసైటీలో జరిగిన అక్రమాలపై సైతం విచారణ జరుగుతోంది.
నిడిగొండ, బచ్చన్నపేట, కళ్లెంలకు అఫిషియల్ పర్సన్ ఇన్‌చార్జ్‌లు
పెండింగ్‌లో జఫర్‌గఢ్ పీఏసీఎస్..
అవినీతి, అక్రమాలు, స్థలాల
అమ్మకాలు, అవకతవకలే కారణం
జిల్లాలోని మిగతా 10 పీఏసీఎస్‌లకు ప్రస్తుత చైర్మన్‌లే పర్సన్ ఇన్‌చార్జ్‌లు
ప్రభుత్వం నాలుగు పీఏసీఎస్‌ల గడువు పొడిగింపు విషయంలో క్లారిటీ ఇచ్చింది. నిడిగొండ, బచ్చన్నపేట, కళ్లెం సొసైటీల పరిధిలో అవకతవకలపై విచారణ కొనసాగుతుండగా, చైర్మన్లకు బదులుగా స్పెషల్ ఆఫీసర్లకు పర్సన్ ఇన్‌చార్జ్ బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులను జారీ చేసినట్లు జిల్లా సహకార సొసైటీ అధికారి వెంకటరాములు తెలిపారు. జఫర్‌గడ్ సొసైటీ విషయంలో ఇన్‌చార్జ్ బాధ్యతలను అప్పగించకుండా విచారణకు ఆదేశించింది. మిగతా 10 పీఏసీఎస్‌లలో చైర్మన్‌న్‌లకే పర్సన్ ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించడంతో వారి ఆధ్వర్యంలోనే సేవలు కొనసాగనున్నాయి. వివాదాస్పదంగా మారిన నాలుగు సొసైటీలకు సంబంధించిన భవి ష్యత్తు ప్రభుత్వ ఎంక్వయిరీ రిపోర్టుపై ఆధారపడి ఉండనుంది. మిగతా సొసైటీల పనితీరుపై కూడా నిఘా పెరగనుంది.
జిల్లాలో 14 సొసైటీల పరిధిలో 10 చోట్ల ప్రస్తుత పాలక మండళ్లకు ఆరు నెలల పాటు గడువు పొడిగించారు. బచ్చన్నపేట, నిడిగొండ, జఫర్‌గడ్, కళ్లెం సొసైటీలకు బ్రేక్ వేయగా, ఇందులో జఫర్‌గడ్ మిన హా మిగతా మూడింటికి అఫిషియల్ పర్సన్ ఇన్‌చార్జ్‌లకు బాధ్యతలు అప్పగించారు. అవినీతి, ఆరో పణలకు సంబంధించిన విచారణ కొనసాగుతుంది. ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టం. సమగ్ర విచారణ జరిపించి నిజనిజాలు బయటకు తీసి, ప్రతి పైసాని వెనక్కి తీసుకుంటాం.

ఆ సొసైటీలకు షాక్!