
పోరాటస్ఫూర్తి ఐలమ్మ
సాక్షి, నెట్‌వర్క్: తెలంగాణ సాయుధ పోరాట యో ధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ 40వ వర్ధంతిని బుధవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి నివాళి అర్పించి ఆమె పోరాటాలను స్మరించుకున్నారు. కలెక్టరేట్‌లోని కాన్ఫ్‌రెన్స్ హాల్‌లో వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఐలమ్మ వర్ధంతి వేడుకల్లో కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ బెన్షాలోమ్, అధికారులు, వివిధ కులసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన చాకలి ఐలమ్మ సేవలు మరువలేనివన్నారు. పాలకుర్తి మండల కేంద్రం రాజీవ్ చౌరస్తాలోని ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి నివాళి అర్పించారు. భూస్వాములు, నిజాం రాజుకు వ్యతిరేకంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ పోరాటం భావితరాలకు స్ఫూర్తిదా యకమన్నారు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో డీసీపీ రాజమహేంద్రనాయక్, పురపాలిక కార్యాలయంలో వీరనారి ఐలమ్మ చిత్రపటానికి మునిసిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్,
వివిధ కుల సంఘాల నాయకులు తదితరులు
పాలకుర్తి టౌన్: నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి,
ఐలమ్మ మునిమనవరాళ్లు చిట్యాల శ్వేత, సంధ్య
ఐలమ్మకు నివాళులర్పిస్తున్న మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి, డీసీపీ రాజమహేంద్రనాయక్
సాయుధ యోధురాలికి ‘జన’ నివాళి

పోరాటస్ఫూర్తి ఐలమ్మ

పోరాటస్ఫూర్తి ఐలమ్మ

పోరాటస్ఫూర్తి ఐలమ్మ