
మోదీ నేతృత్వంలో అగ్రగామిగా భారత్
జనగామ రూరల్: ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో దేశం అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలుస్తోందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి తూటుపల్లి రవికుమార్ అ న్నారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో బుధవారం జి ల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ ఆధ్వర్యంలో సేవాపక్షం జిల్లా కార్యాశాల నిర్వహించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ..ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు పక్షం రోజులపాటు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సేవాపక్షం జిల్లా కన్వీనర్ శశిధర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు తోకల ఉమారాణి అంజిరెడ్డి, నవీన్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఎల్లయ్య, కుమార్ తదితరులు పాల్గొన్నారు.