
వానాకాలంలో ఎండలు..!
● విచిత్రంగా మారుతున్న వాతావరణం
● ఆశ్చర్యానికి లోనవుతున్న జనం
జనగామ: రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచి కొడుతుంటే జిల్లాలో ఎండలు మాత్రం మండుతున్నాయి. వానాకాలం మొదలైనప్పటి నుంచి ఓ వైపు అడపదడపా వర్షాలు, మరో వైపు ఊహించని విధంగా ఎండలు ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఉక్కపోత, వేడిగాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 33 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రతలతో మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లడం కష్టంగా మారిందని ప్రజలు పేర్కొంటున్నారు. వర్షాలు ముఖం చాటేయడంతో రైతాంగం ఆందోళనలో ఉంది. వానాకాలంలో ఎండలు ఏంటని ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.