‘ఇందిరమ్మ’ పురోగతి ఆన్‌లైన్‌లో పొందుపర్చాలి | - | Sakshi
Sakshi News home page

‘ఇందిరమ్మ’ పురోగతి ఆన్‌లైన్‌లో పొందుపర్చాలి

Sep 10 2025 2:15 AM | Updated on Sep 10 2025 2:15 AM

‘ఇంది

‘ఇందిరమ్మ’ పురోగతి ఆన్‌లైన్‌లో పొందుపర్చాలి

జనగామ రూరల్‌: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ అన్నారు. సంబంధిత అధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. మంజూరైనప్పటికీ నిర్మాణాలు ప్రారంభంకాని ఇళ్ల గ్రౌండింగ్‌ ప్రక్రియ వేగవంతం కావాలన్నారు. పూర్తయిన ఇళ్ల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసి లబ్ధిదారులకు నగదు అందేలా ఎంపీడీఓలు కృషి చేయాలన్నారు. మండలాల్లో ఇందిరమ్మ కమిటీ సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. కొత్తగా మంజూరైన గ్రామ పంచాయతీ, అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలు, టాయిలెట్ల నిర్మాణం ప్రారంభించాలని అన్నారు. గ్రామాల్లో ఉపాధి హామీలో పనులు చేపట్టాలన్నారు. మహిళా సంఘాల రుణ మంజూరు లక్ష్యం చేరేలా ఏపీఎం, సీసీలు కృషి చేయాలని అన్నారు. పాఠశాల విద్యార్థుల యూనిఫామ్‌ రెండో జతను త్వరగా కుట్టి విద్యార్థులకు పంపిణీచేయాలన్నారు.

ఇంటర్‌లో మెరుగైన ఫలితాలు సాధించాలి

ఇంటర్‌ వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా అన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఇంటర్‌ కళాశాల ప్రిన్సిపాళ్లతో మంగళవారం కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఇంటర్మీడియట్‌ విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని చెప్పారు. ఫేస్‌ రికగ్నైజ్‌ సిస్టం ద్వారా హాజరు 100 శాతం పూర్తి కావాలన్నారు. సమావేశంలో జిల్లా ఇంటర్‌ విద్యాధికారి జితేందర్‌, వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.

దేవరుప్పుల : మండలంలోని పెద్దమడూరులో ఓనమాలు, ప్రాథమిక, ఉన్నత పాఠశాలలతోపాటు ఇందిరమ్మ, పల్లెప్రగతి పనులను కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులతో ముచ్చటించారు. కోడిగుడ్ల నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు. ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంచుతూ విలువలతో కూడిన విద్యనందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాల సరఫరాపై ఆరా తీశారు. వార్షిక పరిక్షల సమయం సమీపిస్తున్నందున విద్యార్థులు కష్టపడి చదవాలన్నారు. మధ్యాహ్న భోజనం పథకం, నిర్వహణ రికార్డులు పరిశీలించి విద్యార్థుల నమోదు శాతం తగ్గకుండా ఉపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల విషయంలో పలువురికి విద్యుత్‌ తీగల సమస్య దృష్టికి తీసుకురాగా సత్వరమే పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. ఇసుక, కంకర, స్టీలు ధరల నియంత్రణకు సంబంధిత యజమానులతో సమావేశం ఏర్పాటు చేసి నిర్దేశిత సమయంలో లబ్ధిదారులకు ఇల్లు పూర్తయ్యేలా మండల అధికారులు తోడ్పా టు అందించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ ఆడెపు అండాలు, ఎంపీడీఓ సురేష్‌కుమార్‌, ఎంఈఓ కళావతి, ఆర్‌ఐ రాజు, పంచాయతీ కార్యదర్శి శివారెడ్డి తదితరులు ఉన్నారు.

అధికారులు సమన్వయంతో

పనిచేయాలి

కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌

‘ఇందిరమ్మ’ పురోగతి ఆన్‌లైన్‌లో పొందుపర్చాలి 1
1/1

‘ఇందిరమ్మ’ పురోగతి ఆన్‌లైన్‌లో పొందుపర్చాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement