మరోసారి ‘సర్దుబాటు’ | - | Sakshi
Sakshi News home page

మరోసారి ‘సర్దుబాటు’

Sep 8 2025 4:48 AM | Updated on Sep 8 2025 4:48 AM

మరోసారి ‘సర్దుబాటు’

మరోసారి ‘సర్దుబాటు’

మరోసారి ‘సర్దుబాటు’

జనగామ: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఎస్జీటీ, స్కూల్‌ అసిస్టెంట్లకు (ఎస్‌ఏ) పదోన్నతులు కల్పించిన నేపథ్యంలో టీచర్ల సర్దుబాటు ప్రక్రియ మరోసారి చేపట్టేందుకు రంగం సిద్ధం చేశారు. మొదటి విడతలో చేపట్టిన సర్దుబాటుపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. పైరవీలకు పెద్దపీట వేయడంతో సర్కార్‌ బడిని నమ్ముకుని అడ్మిషన్‌ తీసుకున్న విద్యార్థులకు శాపంగా మారింది. దీంతో పలు పాఠశాలల ఆవరణలో తల్లిదండ్రులు సైతం ఆందోళనకు దిగారు. దీనిపై సాక్షి వరుస కథనాలతో సర్దుబాటు ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది.

పదోన్నతుల నేపథ్యంలో..

జిల్లాలో 341 ప్రాథమిక(పీఎస్‌), 67 ప్రాథమికోన్నత, 103 ఉన్నత పాఠశాలల పరిధిలో 29వేల పైచిలుకు విద్యార్థులు చదువుకుంటున్నారు. సుమారు 70 పీఎస్‌ల పరిధిలో జీరో సంఖ్యతో వాటిని మూసివేశారు. ఇటీవలే 87 మంది ఎస్జీటీలు, 17 మంది స్కూల్‌ అసిస్టెంట్లు పదోన్నతులు పొందడంతో పాఠశాలల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని బోధన సౌలభ్యం కోసం సర్దుబాటు అనివార్యమైంది. ఈ ప్రక్రియలో పారదర్శకతపై ఉపాధ్యాయ వర్గాల్లో చర్చలు మళ్లీ మొదలయ్యాయి. మొదటి విడతలో 109 మంది ఉపాధ్యాయుల జాబితాతో జరిగిన సర్దుబాటుపై ఇప్పటికే పలు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. కొంతమంది ప్రభావవంతులైన టీచర్లు తమ పరిధిలోనే ఉండేలా పైరవీలు చేసుకున్నారని, దీంతో కొంతమందికి అన్యాయం జరిగిందని విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో మరోసారి జరిగే ఈ సర్దుబాటు కూడా అదే బాటలో నడుస్తుందా అన్న ఆందోళన టీచర్ల వర్గాల్లో కనిపిస్తోంది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా బోధన సిబ్బందిని కేటాయిస్తామన్న విద్యాశాఖ వాగ్దానం ఎంత వరకు ఆచరణలోకి వస్తుందో చూడాలి.

గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన అడ్మిషన్ల సంఖ్య

బడిబాటలో గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. పిల్లల సంఖ్య కంటే తక్కువ టీచర్లు ఉన్న స్కూల్స్‌ ఉన్నాయి. ఈ పాఠశాలల్లో ఇంకా టీచర్లు అవసరమని తల్లిదండ్రులు చెబుతున్నారు. అదే సమయంలో పలుచోట్ల విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ, ఎక్కువ మంది టీచర్లు కొనసాగుతున్నారు. ఈ సమస్యను అధిగమించడమే సర్దుబాటు ప్రధాన ఉద్దేశం. కానీ ఎప్పటిలాగే మళ్లీ పైరవీలు, బంధుత్వాలు ప్రభావం చూపితే విద్యార్థుల అభ్యసనంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. మొదటి విడతలో కనిపించిన లోపాలను సరిదిద్దకపోతే ఉపాధ్యాయ వర్గాల్లో అసంతృప్తి మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయమై ఇప్పటికే కొన్ని సంఘాలు విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లాయి. సర్దుబాటుపై కలెక్టర్‌ షేక్‌ రిజ్వాన్‌ బాషా దృష్టి సారించి పైరవీలకు ఆస్కారం లేకుండా, విద్యార్థులకు బోధనపరంగా ఇబ్బందులు లేని టీచర్ల నియామకం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని పలువురు టీచర్లు, తల్లిదండ్రులు కోరుతున్నారు. ఒకటి, రెండు రోజుల్లో సర్దుబాటు ప్రక్రియ పూర్తి కానుంది.

87 ఎజ్జీటీ, 17 ఎస్‌ఏలకు పద్నోనతులు

విద్యార్థుల సంఖ్య ఆధారంగా

ఉపాధ్యాయుల సర్దుబాటు

మొదటి విడతలో అనేక ఆరోపణలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement