
ఉపాధ్యాయుల పాత్ర గొప్పది
జనగామ: ప్రతి మనిషి జీవితంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా గొప్పదని వరంగల్ రీజియన్ వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ పెద్ది వెంకటేశం అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని జూబ్లీ గార్డెన్‌లో ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గంగిశెట్టి ప్రమోద్ కుమార్ ఆధ్యక్షతన జరిగిన గురుపూజోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.. విద్యాబుద్ధులు నేర్పిన టీచర్లను ఎప్పటికీ మరువద్దన్నారు. ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గంగిశెట్టి ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ.. 15 సంవత్సరాలుగా ఎవరూ చేయలేని విధంగా 60 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి, గురుపూజోత్సవం సందర్భంగా ఘనంగా సత్కరించి, జ్ఞాపికలను అందించామన్నారు. కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పోకల లింగయ్య, ఫర్టిలైజర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పజ్జూరి గోపయ్య, రైస్ మిల్లర్ ప్రతినిధి పజ్జూరి జయహరి, రత్నప్రసాద్, బెజగం భిక్షపతి, వరూధిని, గంగిశెట్టి అనూజ, తమ్మి స్రవంతి, గజ్జి సంతోష్ కుమార్, నాగమల్ల సోమయ్య, పడకంటి రవీందర్, వేదకుమారు, గందె సోమన్న మాశెట్టి వేణుగోపాల్ తదితరులు ఉన్నారు.
వరంగల్ రీజియన్ వాణిజ్య పన్నుల శాఖ
డిప్యూటీ కమిషనర్ వెంకటేశం