
అనాథాశ్రమంలో మిలాద్ ఉన్ నబీ వేడుకలు
జనగామ రూరల్: మిలాద్ ఉన్ నబీ సందర్భంగా మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం పసరమడ్లలోని అనాథాశ్రమంలో పిల్లలకు పండ్లు, బ్రెడ్, బిస్కెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మిలాద్ సోషల్ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షుడు అన్వర్, సభ్యులు ఎక్బల్, హమీద్, అక్బర్, బాసిద్, మోహిన్, సుమేర్, మెయిజ్, యాకుబ్, సల్మాన్, ఇమ్రాన్, జమాల్, అశు, రమీజ్, జుబేర్ పాల్గొన్నారు.
రక్తదాన శిబిరం..
మిలాద్ ఉన్ నబీ పురస్కరించుకొని ఏకే చారిటబు ల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పట్టణంలోని గుండ్లగడ్డలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో చైర్మన్ అబ్దుల్ మొయిజ్, కన్వీనర్ మాజీద్ అఫ్సర్, సైఫ్, కై ఫ్, అర్షద్ ఉర్ రెహమాన్, దిశ కమిటీ సభ్యుడు బక్క శ్రీను, గౌసి, సాదిక్, మాజీ కౌన్సిలర్ సమద్ తదితరులు పాల్గొన్నారు.