
దిక్సూచి
విద్యలో నూతన ఒరవడికి కలెక్టర్ ప్రత్యేక చొరవ
జిల్లాకు ప్రత్యేక గుర్తింపు
రాష్ట్రంలో విద్యాపరంగా జనగామ ముందువరుసలో ఉంది. కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా విద్యలో ప్రత్యేక దృష్టి పెట్టి నిరంతరం పర్యవేక్షిస్తుండడం వల్ల పదో తరగతి ఫలితాల్లో 3వ స్థానం, కేంద్రం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన న్యాస్ సర్వేలో దేశంలో 50 స్థానంలో నిలిచింది. ఉపాధ్యాయులు, అధికారులు, విద్యార్థుల తల్లి దండ్రుల కృషితో ప్రగతి సాధిస్తోంది. అయితే ఈ ఏడాది నుంచి జిల్లాలో అమలు చేస్తున్న ఈ ప్రణాళిక రాష్ట్రవ్యాప్తంగా మోడల్‌గా నిలిచే అవకాశముంది.
నూతన విద్యావిధానం లక్ష్యాల అమలులో భాగంగా జిల్లాలో విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం పాఠశాల విద్యా విభాగం ‘దిక్సూచి’ పేరుతో ప్రత్యేక ప్రణాళిక ప్రారంభించాం. పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా విద్యార్థులు జీవితంలో అవసరమైన విద్యా నైపుణ్యాలు, వ్యక్తిత్వ వికాసం, సృజనాత్మకత, సాంకేతిక పరిజ్ఞానం, నైతిక విలువలు, యోగా, క్రీడలు, ధ్యానం ద్వారా శారీరక, మానసిక శ్రేయస్సు ఆరోగ్యం వంటి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ఈ ప్రణాళిక రూపుదిద్దుకుంటుంది. ఉపాధ్యాయులు, అధికారులు నిబద్ధతతో ముందుకెళ్లాలి.
– కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా

దిక్సూచి

దిక్సూచి