
ఆలయాల ద్వారబంధనం
సాక్షి, నెట్‌వర్క్: సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా జిల్లాలో ఆదివారం ఆలయాలను మూసివేశారు. కొడవటూరు సిద్దులగుట్ట, చీటకోడూరు శ్రీ పంచకోసు రామలింగేశ్వర, జనగామ పాతబీటుబజారు శ్రీరామలింగేశ్వర, బాణాపురం శ్రీ వెంకటేశ్వర, బతుకమ్మకుంట శ్రీ విజయదుర్గా మాత, శ్రీ సాయిబాబా, హెడ్ పోస్టాఫీసు శ్రీ సంతోషీమాత, గుండ్లగడ్డ శ్రీ ఉమా మహేశ్వరస్వామి, పోలీస్టేషన్ ఏరియాలోని శ్రీ చెన్నకేశ్వరతో పాటు ఆయా మండలాల పరిధిలో ఆలయాలను మూసి వేశారు. పాలకుర్తి శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో మధ్యాహ్నం కవాట బంధనం చేశారు. తిరిగి సోమవారం ఉదయం సంప్రోక్షణాది పూజా కార్యక్రమాల అనంతరం ఉదయం 7.30 గంటలకు భక్తులకు అర్జిత సేవలు, దర్శనానికి అనుమతించడం జరుగుతుందని ఆలయ ఈఓ సల్వాది మోహన్‌బాబు తెలిపారు. ద్వారబంధనం కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, ఆలయ అర్చకులు దేవగిరి లక్ష్మన్న, డీవీఆర్‌శర్మ, దేవగిరి అనిల్‌కుమార్, మత్తగజం నాగరాజు పాల్గొన్నారు. లింగాలఘణపురం మండలంలోని జీడికల్ వీరాచల రామచంద్రస్వామి ఆలయాన్ని మధ్యాహ్నం 12.30 గంటలకు ద్వార బంధనం చేసినట్లు ఆలయ పూజారి భార్గవాచార్యులు తెలిపారు. మధ్యాహ్నం అర్చన, ఆరగింపు అనంతరం చిల్పూరుగుట్ట శ్రీబుగులు వేంకటేశ్వరస్వామి ఆలయ ద్వార బంధనం చేసినట్లు అర్చకులు తెలిపారు. ఈఓ లక్ష్మిప్రసన్న, చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్‌రావు, రవీందర్‌శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్య పాల్గొన్నారు.

ఆలయాల ద్వారబంధనం

ఆలయాల ద్వారబంధనం