
వైభవంగా అనంత పద్మనాభస్వామి ఉత్సవాలు
రఘునాథపల్లి: మండలంలోని ఫతేషాపూర్‌లోని శ్రీభక్తాంజనేయస్వామి ఆలయంలో వెలసిన అనంత పద్మనాభస్వామికి శనివారం గ్రామస్తులు వైభవంగా ఉత్సవాలు నిర్వహించారు. అనంత చతుర్థిని పురస్కరించుకొని జిల్లాలోనే ఏకై క అనంత పద్మనా భస్వామి ఆలయమైన ఫతేషాపూర్‌కు పలు జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చి వ్రత పూజలు చేశారు. వందలాది మంది భక్తులతో ఆలయం కిక్కిరిసింది. ప్రధానార్చకుడు రాజేష్ భార్గవ గణేష్‌పూజ, నవగ్రహ పూజ, పంచామృతభాషేకం, అర్చనలు నిర్వహించారు. పలువురు దంపతులు కోటి వత్తులతో దీపారాదన చేశారు. హనుమాన్ భజన మండలి, గ్రామస్తులు భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు.