
కోర్టుకు హాజరైన ఉద్యమకారులు
జనగామ రూరల్: జిల్లా ఉద్యమ సమయంలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్, వివిధ పార్టీ నాయకులపై కేసులు ఉండగా శనివారం ఉద్యమకారులు జిల్లా కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతున్న కేసులు కోట్టేయడం లేదని, ప్రభుత్వం చొరవ తీసుకొని కేసులు తొలగించాలని కోరారు. డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు చౌడ రమేశ్, ఆరుట్ల దశమంతరెడ్డి, కేవీఎల్‌ఎన్ రెడ్డి, ఉడుగుల రమేశ్, పెద్దోజు జగదీష్, తదితరులు కోర్టుకు హాజరైన వారిలో ఉన్నారు.