జనగామ బతుకమ్మకుంటతో పాటు పట్టణ, బైపాస్ జంక్షన్ల వద్ద సుందరీకరణ, స్వాగత తోరణ పనులకు రూ.2.50 కోట్ల మేర నిధులను ఖర్చు చేస్తున్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆధ్వర్యంలో మున్సిపల్ ఎల్‌ఆర్ ఎస్, జనరల్ ఫండ్ నిధులను వెచ్చించి ఈ పనులను చేపడుతున్నారు. ఈ నెల 22వ తేదీ నుంచి బతుకమ్మ పండుగ ప్రారంభం కానున్న నేపధ్యంలో సుందరీకరణ పనుల్లో మరింత వేగం పెంచారు. సద్దులు, దసరా ఉత్సవాలను ఆనవాయితీగా ఏటా ఇందులోనే నిర్వహించనున్నారు. పండుగ దగ్గర పడుతున్న నేపధ్యంలో పనులను త్వరగా పూర్తి చేసేందుకు కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు.
యశ్వంతాపూర్ ముఖద్వారం వద్ద
స్వాగత తోరణం