
విద్యుత్, పోలీసు శాఖల సమీక్ష
వినాయక నిమజ్జనం పురస్కరించుకుని విద్యుత్ శాఖ డివిజన్ కార్యాలయంలో డీసీపీ రాజమహేంద్రనాయక్, ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ టి.వేణుమాధవ్ గురువారం సమీక్ష నిర్వహించారు. డీసీపీ మాట్లాడుతూ.. గణేశ్ నిమజ్జన శోభాయాత్రను పురస్కరించుకుని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతిమలను నిమజ్జనానికి తరలించే సమయంలో ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. వార్డుల్లో కిందకు జారిన లైన్లను సరిచేయాలని డీసీపీ కోరారు. ఊరేగింపు కార్యక్రమాల్లో డీజేలకు అనుమతి లేదని, వినియోగిస్తే సీజ్ చేస్తామన్నారు. నిమజ్జన సమయంలో ఎటువంటి ఇబ్బంది కలిగినా వెంటనే 100 నెంబర్‌కు డయల్ చేయాలన్నారు. నిమజ్జనం కోసం నెల్లుట్ల చెరువు వద్దకు తీసుకెళ్లాలి.