నేడు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం
పల్లెల్లో మూతపడిన ప్రభుత్వ పాఠశాలలకు పునరుజ్జీవం పోస్తూ ప్రతిరోజూ ఇంటింటికీ వెళ్లి విద్యార్థులను పాఠశాలకు తీసుకొస్తున్న ఆదర్శ ఉపాధ్యాయులు సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. కొందరు కథలు, రచనలతో పాఠాలపై అవగాహన కల్పిస్తుండగా, మరికొందరు సాంకేతిక బోధనోపకరణాల ద్వారా బోధన సాగిస్తున్నారు. పలువురు ఉపాధ్యాయులు వినూత్న బోధనారీతుల ద్వారా విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు.
– మరిన్ని కథనాలు 8లోu
దేవరుప్పుల: జిల్లాలోని దేవరుప్పుల మండలం మాధాపురం ప్రాథమిక పాఠశాలకు గతేడాది ప్రధానోపాధ్యాయురాలిగా నల్ల లలిత విధుల్లో చేరారు. అనతి కాలంలోనే ముప్పైలోపు ఉన్న విద్యార్థుల సంఖ్యను 90మందికి చేరేలా కృషి చేశారు. విద్యార్థులకు అత్యుత్తమ భోధన అందించేలా హెచ్‌ఏం లలిత తన భర్త రమేశ్ సహకారంతో ఆంగ్లమాధ్యమం చదువులో సామర్థ్యం తక్కువ ఉన్న వారి కోసం ఏఐఎక్సల్ ల్యాబ్ ఏర్పర్చారు. కార్పొరేట్ పాఠశాల మాదిరిగా విద్యార్థులకు టై, బెల్టులు, ఐడీ కార్డులు, దినచర్య కోసం డైరీలు, క్రీడా దుస్తులు, తాగునీటి కోసం కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ఫౌండేషన్ సహకారంతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయించారు. విద్యార్థులకు చేతిరాత (కాలీగ్రాఫిక్) శిక్షణ సైతం ఇప్పించారు. బడిబాటలో జిల్లాలోనే అగ్రభాగాన ఈ పాఠశాల చేరడంతో పరిసర గిరిజన తండాల నుంచి ప్రత్యేక వాహనం ఏర్పర్చుకొని విద్యార్థులు వస్తుండడం గమనార్హం.
జనగామ: ఎన్నో సంవత్సరాలుగా మూతబడి..నూతన విద్యా సంవత్సరంలో తెరుచుకున్న బడిలో విద్యార్థుల సంఖ్యను పెంచడంతో పాటు చక్కని బోధన చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఆ యువ ఉపాధ్యాయురాలు. జనగామ మండలం ఎర్రకుంట తండా ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న రేష్మా 2024 డీఎస్సీ ద్వారా ఎంపికయ్యారు. పాఠశాలకు వచ్చిన రేష్మా గ్రామంలో వాడవాడలా తిరిగి 40 మంది విద్యార్థులను చేర్పించారు. ఈ స్కూల్ రీ ఓపెన్‌లో భాగంగా కలెక్టర్ రిజ్వాన్ బాషా వెళ్లి ఘనంగా ప్రారంభించారు. ఈ పాఠశాలలో విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో రేష్మా బోధన చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
– జనగామ
గురువుకు వందనం
గురువుకు వందనం
గురువుకు వందనం
గురువుకు వందనం