
కులవృత్తులకు అండ..
స్టేషన్‌ఘన్‌పూర్: సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కులవృత్తులకు అండగా పనిచేస్తోందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఘన్‌పూర్ పట్టణకేంద్రంలోని రైతు వేదికలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ చెక్కులు, గీత కార్మికులకు కాటమయ్య సు రక్ష కిట్స్ పంపిణీ చేపట్టారు. కార్యక్రమానికి ఎంపీ కడియం కావ్య, కలెక్టర్ రిజ్వాన్ బాషా హాజరయ్యా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవతో పనిచేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, బీసీ వెల్ఫేర్ జిల్లా అఽధికారి రవీందర్, ఆర్‌డీఓ వెంకన్న, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఏఎంసీ చైర్మన్ లావణ్యశిరీశ్‌రెడ్డి, ఎకై ్సజ్ సీఐ భాస్కర్‌రావు, ఆర్‌ఐలు సతీష్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
కమ్యూనిటీ భవనాల మంజూరు
పత్రాల పంపిణీ..
పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గంలోని వివిధ మండలాల్లోని పలు గ్రామాలకు ఎంపీ నిధుల నుంచి మంజూరైన కమ్యూనిటీ భవనాలకు సంబంధించిన పత్రాలను ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య చేతుల మీదుగా అందించారు.
వనిత టీస్టాల్ ప్రారంభం..
మహిళల సంక్షేమానికి, మహిళల భద్రతకు, ఆర్థిక స్వావలంబనకు సీఎం రేవంత్‌రెడ్డి పెద్దపీట వేస్తున్నారని ఎంపీ కడియం కావ్య అన్నారు. ఘన్‌పూర్ డివిజన్‌కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా నూతనంగా ఏర్పాటు చేసిన వనిత టీస్టాల్‌ను ఎంపీ కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కలెక్టర్ రిజ్వాన్ బాషా ప్రారంభించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ
స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే
కడియం శ్రీహరి