
ఆకట్టుకునేలా బతుకమ్మకుంట
జనగామ రూరల్: బతుకమ్మకుంటను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని, సుందరీకరణ పనులు వేగవంతంగా చేపట్టాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. గురువారం బతుకమ్మకుంట అభివృద్ధి పనులను అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్‌తో కలిసి పర్యవేక్షించారు. ఈసందర్భంగా బతుకమ్మ కుంటలో అందమైన రంగులతో ఏర్పాటు చేసిన గ్రిల్స్‌ను, బెంచీలను పరిశీలించారు. వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్ పార్క్ పనులను వేగవంతంగా బ చేపట్టాలన్నారు. కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి, పంచాయతీరాజ్ ఈఈ ఇంజనీర్ శ్రీనివాస్‌రావు, ఉద్యాన శాఖ అధికారి శ్రీధర్ తదితరులు ఉన్నారు.
పర్యావరణ పరిరక్షించాలి..
జనగామ: భవిష్యత్తుతరాలకు కాలుష్య రహిత స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించే బాధ్యత మనందరిపై ఉందని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంటలో ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన వన మహోత్సవం కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేశ్‌కుమార్‌తో కలిసి కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కను నాటి నీరు పోశారు. కార్యక్రమంలో జిల్లా ఎకై ్సజ్ అధికారి అనిత, సీఐలు ప్రభావతి, సంతోష్‌రెడ్డి, ఎస్సైలు జనార్దన్, మధు, నరేశ్, రాధిక, పద్మ, సుధ, మాధురి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా