
ఆరోగ్య జనగామకు కృషి
● ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
జనగామ: ఆరోగ్యవంతమైన జనగామ నియోజకవర్గం కోసం అహర్నిషలు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన 43 మంది లబ్ధిదారులకు రూ.13.10లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన నాటినుంచి నీలిమా ఆస్పత్రిలో ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించడంతో పాటు ఉచితంగా మందులు సైతం ఇస్తున్నామన్నారు. జిల్లా జన రల్ ఆస్పత్రిలో సిటీస్కాన్ కోసం మొదటి నుంచి మంత్రి దామోదర నర్సింహతో మాట్లాడుతున్నానని, యంత్రం బిగించిన తర్వాత సేవల ఆలస్యంపై అసెంబ్లీలో కోరుట్ల ఎమ్మెల్యేతో మాట్లాడించిన రెండు రోజుల్లోనే ప్రారంభించారన్నారు. కార్యక్రమంలో నాయకులు ఇర్రి రమణారెడ్డి, బాల్దె సిద్ధిలింగం, పోకల జమునలింగయ్య, గాడిపెల్లి హేమలతరెడ్డి, ముస్త్యాల దయాకర్, ఉల్లెంగుల సందీప్, చంద్రారెడ్డి, కృష్ణంరాజు, ఉడుగులు కిష్టయ్య, శ్రీనివాస్, మద్దికుంట రాధ, అనిత, విజయ్, గోవర్ధన్, రాజు, నర్సింగ్, రామక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.