
సిద్దేశ్వరాలయ హుండీ రూ.5లక్షలు
బచ్చన్నపేట: మండలంలోని కొడవటూర్ గ్రామంలోని స్వయంభూ శ్రీసిద్దేశ్వరాలయ హుండీ ఆదాయం రూ. 5 లక్షల 345లు వచ్చినట్లు ఆలయ ఈఓ చిందం వంశీ తెలిపారు. గురువారం హుండీ లెక్కింపు అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇది ఆరు నెలల హుండీ ఆదాయమన్నారు. హుండీ లెక్కింపునకు పర్యవేక్షణ అధికారిగా దేవాదాయ, దర్మాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ వెంకటలక్ష్మి హాజరుకాగా ఆలయ కమిటీ చైర్మన్ ఆముదాల మల్లారెడ్డి, సీబీఐ బీఎం గోపీనాయక్ , ప్రధాన పూజారి ఓంనమశివాయ, ధర్మకర్తలు నిమ్మ కర్ణాకర్‌రెడ్డి, నేరెళ్ల రాజయ్య, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.