
సన్నబియ్యం పంపిణీ పకడ్బందీగా జరగాలి
జనగామ రూరల్: జిల్లా సన్నబియ్యం పంపిణీ పకడ్బందీగా జరగాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. పట్టణంలోని 7, 18 రేషన్ షాప్‌లను బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బియ్యం సరఫరాలో ఇబ్బందులు, నాణ్యత గురించి తెలుసుకున్నారు. కొత్తగా వచ్చిన రేషన్ కార్డుదారులు సన్న బియ్యం పొందాలన్నారు. జిల్లాలోని రేషన్ డీలర్లు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సమయపాలన పాటిస్తూ రేషన్ షాపులు సకాలంలో తెరిచి లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా పంపిణీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీఎస్‌ఓ ఇర్ఫాన్ అహ్మద్ ఖాన్, డీటీసీఎస్‌ఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
సైన్స్‌ల్యాబ్‌లతో సృజనాత్మకత
సైన్స్‌ల్యాబ్‌లతో విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీయడానికి ఉపయోగపడతాయని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. బుధవారం ఎన్‌ఆర్‌ఐలు రూ.15లక్షలతో పెంబర్తిలోని జెడ్పీ పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్‌ల్యాబ్‌ను ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో సైన్స్ అండ్ టెక్నాలజీకి అధిక ప్రాధాన్యం ఉందన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటే భవిష్యత్‌లో నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టొచ్చన్నారు. ల్యాబ్‌ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, జిల్లాలో పెంబర్తి జడ్పీ హైస్కూల్ ఒక మోడల్ పాఠశాలగా రూపుదిద్దుకోవాలన్నారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అమెరికా ఇండియా ఫౌండేషన్ తెలంగాణ ప్రతినిధి రమేశ్, అట్లాస్ ప్రతినిధులు, ఏఎంఓ శ్రీనివాస్, ఎంఈఓ శంకర్‌రెడ్డి, హెచ్‌ఓం నాగరాణి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ రిజ్వాన్ బాషా