
స్వచ్ఛమైన తాగునీరు అందించాలి
జనగామ: జనగామ పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించే విధంగా మున్సిపల్ కమిషనర్ నిత్యం పర్యవేక్షణ చేయాలని డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి అన్నారు. బు ధవారం చీటకోడూరు రిజర్వాయర్‌తో పాటు ఫిల్టర్ బెడ్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫిల్టర్ బెడ్‌ను ప రిశీలించిన అనంతరం కమిషనర్ మహేశ్వర్‌రెడ్డికి సమాచారం అందించగా, ఆయన అక్కడికి వచ్చా రు. రోజువారీగా సప్‌లైయ్ చేస్తున్న తాగునీటి విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. ప్ర జా సంక్షేమం విషయంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. డీసీసీ అధ్యక్షుడి వెంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యా దవ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చెంచారపు బుచ్చిరె డ్డి, నాయకులు చెంచారపు కరుణాకర్‌రెడ్డి, మెరుగు బాలరాజు, బనుక ప్రభాకర్, ప్రకాశ్ యాదవ్, చి క్కుల వెంకటేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.
డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి
చీటకోడూరు రిజర్వాయర్ సందర్శన