
నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించాలి
● డీసీపీ రాజమహేంద్ర నాయక్
జనగామ రూరల్/స్టేషన్‌ఘన్‌పూర్: వినాయక నిమజ్జన వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని డీసీపీ రాజమహేంద్ర నాయక్ తెలిపారు. బుధవారం పట్టణంలోని జ్యోతినగర్ కాలనీలో జై హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో డీసీపీ ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తులు నిమజ్జన వేడుకల్లో జాగ్రత్తలు తీసుకోవాలని, పోలీసుల సూచనలు పాటించాలన్నారు. కార్యక్రమంలో యూత్ అధ్యక్షుడు బాల్దే దేవేందర్, తాడూరి వెంకట్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఘన్‌పూర్ శివారు పుట్టలమ్మ కుంట వద్ద చేపడుతున్న ఏర్పాట్లను స్టేషన్‌ఘన్‌పూర్ ఆర్డీఓ డీఎస్ వెంకన్న, సీఐ జి.వేణుతో కలిసి బుధవారం పరిశీలించారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్యపై దృష్టి సారించాలన్నారు. తహసీల్దార్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ తదితరులు ఉన్నారు.