
సీపీఎస్‌ను రద్దు చేయాల్సిందే..
● మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని కాంగ్రెస్ సర్కార్ నెరవేర్చాలి
● టీఎన్జీవో, జేఏసీ జిల్లా అధ్యక్షుడు
ఖాజా షరీఫ్
జనగామ: ఉద్యోగ, ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారిన సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని టీఎన్జీవో, జేఏసీ అధ్యక్షుడు ఖాజా షరీఫ్ డిమాండ్ చేశారు. సోమవారం జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి భారీ ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. కలెక్టరట్ ఆవరణలో రెండు గంటల పాటు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఖాజా షరీఫ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో పాత పెన్షన్ విధానం(ఓపీఎస్) పునరుద్ధరించేందుకు మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఒక్కసారి ఎన్నికై న ఎమ్మెల్యేలు, ఎంపీలకు జీవితాంతం పెన్షన్ లభిస్తోందని, 35 సంవత్సరాలు ప్రజాసేవ చేసిన ప్రభుత్వ ఉద్యోగికి పెన్షన్ ఇవ్వకపోవడం ఎంత అన్యాయమో ఆలోచించాలన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం సీపీఎస్‌ను రద్దు చేసి, ఓపీఎస్ అమలు చేయాలని, లేని పక్షంలో రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు కొర్నేలియస్, పి.చంద్రశేఖర్‌రావు, షరీఫ్, లక్ష్మీనారాయణ, పెండెల శ్రీనివాస్, పేర్వారం ప్రభాకర్, హఫీజ్, రాజనర్సయ్య, సంపత్ కుమార్, రాంనరసయ్య, మడూరి వెంకటేశ్, ఉప్పలయ్య, స్టెల్లా, శ్రీధర్‌బాబు, నాగార్జున, విష్ణు, అరుణ, బాబు, మధు శంకర్, రాజు, చందర్, రమేశ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.