
ఆరు గ్యారంటీలు అమలు చేయాలి
● కలెక్టరేట్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా
జనగామ రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని, అలాగే ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అవకతవకలపై విచారణ చేపట్టి అర్హులైన పేదలకు ఇళ్లు ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు చింతల రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. వరికి రూ.500 బోనస్ అని బోగస్ చేశారని, తక్షణమే నిధులు విడుదల చేయాలన్నారు. వర్షాలు, వరదల నష్టాలపై అసెంబ్లీలో మాట్లాడలేదని.. రాజకీయ పబ్బం కోసమే అర్ధరాత్రి వరకు నిర్వహించారని విమర్శించారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహం నుంచి ర్యాలీ చేపట్టి కలెక్టరేట్ వద్దకు చేరుకొని ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా పోలీసులకు, నాయకులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో మహిళా కానిస్టేబుల్ చేతికి స్వల్పగాయమైంది. అనంతరం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌కు వినతిపత్రం అందజేశారు. మాజీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కేవీఎల్‌ఎన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు శివరాజ్‌యాదవ్, దుబ్బ రాజశేఖర్, పార్లమెంట్ కో కన్వీనర్ కొంతం శ్రీనివాస్, ఉడుగుల రమేశ్, లేగ రామ్‌మోహన్‌రెడ్డి, అంజిరెడ్డి, ఉమారాణి, పట్టణ అధ్యక్షుడు అనిల్ పాల్గొన్నారు.