
చిల్పూరు హుండీ ఆదాయం రూ.10.67లక్షలు
చిల్పూరు: చిల్పూరుగుట్ట శ్రీబుగులు వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం హుండీల లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఉదయం అర్చకులు రవీందర్‌శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యుల వేదమంత్రాల నడుమ అష్టదళ పాదపద్మారాధన పూజ అనంతరం దేవాదాయశాఖ పరిశీలకులు చిందం వంశీ ఆధ్వర్యంలో ఆలయ ఈవో లక్ష్మీప్రసన్న, చైర్మన పొట్లపల్లి శ్రీధర్‌రావు, ధర్మకర్తలు గనగోని రమేశ్, పుల్యాల నారాయణరెడ్డి, రత్నాకర్‌రెడ్డి, గోళి రాజశేఖర్ సమక్షంలో హుండీల లెక్కింపులో స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన వాసవీ వనిత క్లబ్ వారు పాల్గొన్నారు. హుండీల ఆదాయం రూ.10,67,650లతో పాటు ఖతర్ దేశానికి చెందిన 10 రియాల్స్ ఆదాయం వచ్చినట్లు ఈవో తెలిపారు.
9, 10 తేదీల్లో ఉద్యోగులకు రాష్ట్రస్థాయి క్రీడలు
జనగామ రూరల్: తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్ 2025–26లో ఉద్యోగులు పాల్గొనాలని జిల్లా యువజన క్రీడల అధికారి బి.వెంకటరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. తెలంగాణ రాష్ట్ర స్థాయి సివిల్ సర్వీస్ సెలక్షన్ ట్రయల్స్‌లో భాగంగా హెదరాబాద్‌లో వివిధ స్టేడియాలలో ఈ నెల 9, 10 తేదీల్లో రాష్ట్ర స్థాయి ఎంపికలు నిర్వహిస్తున్నారని, ఇందులో భాగంగా పట్టణంలోని ధర్మకంచ మినీ స్టేడియంలో ఈనెల 6తేదీ ఉదయం 9 గంటలకు జరిగే సెలక్షన్స్ జరుగనున్నాయి. ఆసక్తిగల ప్రభుత్వ ఉద్యోగులు ఐడీ కార్డు, సర్వీస్ సర్టిఫికెట్ జిరాక్స్‌లతో హాజరు కావాలని ఆయన తెలిపారు. అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్, బ్యాడ్మింటన్, క్రికెట్, చెస్, క్యారమ్స్, ఫుట్‌బాల్, హాకీ, కబడ్డీ, లాన్ టెన్నిస్, పవర్ లిఫ్టింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, వాలీ బాల్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, బెస్ట్ ఫిజిక్, యోగా, ఖోఖో క్రీడలు నిర్వహిస్తారని చెప్పారు. మరిన్ని వివరాలకు 96521 97323 నెంబర్‌లో సంప్రదించాలని ఆయన సూచించారు.
తెలుగు జాతీయ సదస్సుకు కుమారస్వామికి ఆహ్వానం
జనగామ: హైదరాబాద్‌లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ కామర్స్ సంస్థ నిర్వహిస్తున్న తెలుగు సాహితీమూర్తుల సమాలోచన జాతీయ సదస్సుకు వరంగల్ ఎల్బీ కళాశాల తెలుగు విభాగంలో సీనియర్ ఆధ్యాపకుడిగా పనిచేస్తున్న కోడం కుమారస్వామికి ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ.. తెలుగు సాహితీమూర్తులు కాళోజీ నారాయణరావు, దాశరథి సోదరులు కృష్ణమాచార్య, రంగాచార్య, డాక్టర్ సి.నారాయణరెడ్డి శతజయంతిని పురస్కరించుకొని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ కామర్స్ డిగ్రీ పీజీ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో ఈనెల 10న ఒకరోజు జాతీయ తెలుగు సాహిత్య సదస్సు నిర్వహించడం జరుగుతుందన్నారు.కాళోజీ కవిత్వం, మానవతావాద దృక్పథం అనే అంఽశంపై పత్ర సమర్పణ చేసి ప్రసంగించనున్నట్లు తెలిపారు.
జిల్లావాసికి
కీర్తి పురస్కారం
పాలకుర్తి టౌన్: మండలంలోని తొర్రూరు(జె) గ్రామానికి చెందిన రచయిత, సాక్షి జర్నలిస్టు పడిగిపాల ఆంజనేయులుకు మంగళవారం తెలుగు విశ్వవిద్యాయలం కీర్తి పురస్కారం ప్రదానం చేసింది. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో 2023 కీర్తి పురస్కారాన్ని (జీవిత చరిత్ర విభాగం)లో తెలుగు యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఎన్.నిత్యానందరావు చేతుల మీదుగా ఆంజనేయులు అందుకున్నారు. మలేషియా తెలుగు వారి మీద పరిశోధనాత్మక వ్యాసాలు, సామాజిక అంశాల మీద విశ్లేషణాత్మక వ్యాసాలు.. తదితర గ్రంథాలకుగాను కీర్తి పురస్కారం అందుకున్నారు. ఈసందర్భంగా ఆంజనేయులును సోమనాథ కళాపీఠం అధ్యక్షుడు రాపోలు సత్యనారాయణ, సాహితీవేత్త శంకరమంచి శ్యాంప్రసాద్, మారం లక్ష్మీనారాయణ, మామిండ్ల రమేశ్‌రాజా, పులి గణేశ్, గుమ్మడిరాజుల సాంబయ్య తదితరులు అభినందించారు.

చిల్పూరు హుండీ ఆదాయం రూ.10.67లక్షలు

చిల్పూరు హుండీ ఆదాయం రూ.10.67లక్షలు