సర్కార్‌ దవాఖానాల్లో మెరుగైన వైద్యసేవలు | - | Sakshi
Sakshi News home page

సర్కార్‌ దవాఖానాల్లో మెరుగైన వైద్యసేవలు

Sep 3 2025 4:33 AM | Updated on Sep 3 2025 4:33 AM

సర్కార్‌ దవాఖానాల్లో మెరుగైన వైద్యసేవలు

సర్కార్‌ దవాఖానాల్లో మెరుగైన వైద్యసేవలు

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి

దామోదర రాజనర్సింహ

జిల్లా జనరల్‌ ఆస్పత్రిలో ిసీటీస్కాన్‌ సేవలు ప్రారంభం

జనగామ: రాష్ట్రంలో సర్కారు దవాఖానాల్లో నిరుపేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకే ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సాక్షిలో వరుస కథనాలతో జిల్లా ఆస్పత్రిలో ిసీటీస్కాన్‌ యంత్రం వచ్చిన సంగతి తెలిసిందే. జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సీటీ స్కాన్‌ సేవలను మంగళవారం కలెక్టర్‌ షేక్‌ రిజ్వాన్‌ బాషా, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, అదనపు కలెక్టర్లు పింకేశ్‌ కుమార్‌, బెన్‌షాలోమ్‌, డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ పాలకుర్తి ఇన్‌చార్జ్‌ ఝాన్సీరెడ్డి, డీఎంహెచ్‌ఓ మల్లికార్జున్‌, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాజలింగం, మెడికల్‌ కళా శాల ప్రిన్సిపాల్‌ నాగమణితో కలిసి మంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు. సీటీ స్కాన్‌ సేవలను ప్రారంభించిన అనంతరం మంత్రి జనరల్‌, డయాలసిస్‌ వార్డులతో పాటు అన్ని విభాగాలను సందర్శించారు. ఆసుపత్రి సేవలపై పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. మెడికల్‌ కళాశాల, నర్సింగ్‌ కాలేజ్‌ నిర్మాణ పనులతో పాటు సీజనల్‌ వ్యాధు ల కట్టడి, తదితర వాటిపై ఆరా తీశారు. పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, సీఎంఎస్‌ల పనితీరుపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. మెడికల్‌ కళాశాల విద్యార్థుల కోసం నిర్మిస్తున్న హాస్టల్స్‌ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు.

సమస్యలు పరిష్కరించాలి..

తమ సమస్యలను పరిష్కరించాలని ఆశ వర్కర్లు మంత్రికి వినతి పత్రం అందించారు. గానుగుపహాడ్‌ బ్రిడ్జి నిర్మాణం వెంటనే చేపట్టాలని కోరుతూ యాసారపు కర్ణాకర్‌, సందీప్‌ తదితరులు కోరారు. పెండింగ్‌ స్కాలర్‌షిప్స్‌ వెంటనే రిలీజ్‌ చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మంత్రికి విన్నవించారు. ఎన్‌హెచ్‌ఎం కాంట్రాక్టు సిబ్బంది పెండింగ్‌ వేతనాలు అందించాలని మొరపెట్టుకున్నారు.

సత్కారం..

మంత్రి రాజనర్సింహను ఎమ్మెల్యే పల్లా, డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డాక్టర్‌ గోపాల్‌రావు, ఏఎంసీ చైర్మన్‌ బనుక శివరాజ్‌యాదవ్‌, డీసీపీ రాజమహేంద్రనాయక్‌, వంగాల మల్లారెడ్డి, నర్సిరెడ్డి, జంగి విద్యానాథ్‌, నర్సింహరెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement