
ఈవీఎంలను పరిశీలించిన కలెక్టర్
జనగామ రూరల్: సాధారణ తనిఖీలో భాగంగా మంగళవారం కలెక్టరేట్‌లో ఉన్న ఈవీఎం గోదాంను షేక్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ బెన్షలోమ్ సందర్శించారు. ఈ సందర్భంగా భద్రతా పుస్తకం, సీసీ కెమెరాల పనితీరు, అగ్ని నియంత్రణ సదుపాయాలను పరిశీలించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు బి.భాస్కర్, బీఆర్‌ఎస్ నాయకుడు ఆర్.రవి, బీజేపీనుంచి ఎ.విజయభాస్కర్, టీడీపీకి చెందిన అజయ్, బీఎస్‌పీ చంద్రశేఖర్, ఆర్‌డీఓ గోపిరామ్, ఎన్నికల శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సాంకేతిక అక్షరాస్యత అందించాలి..
ఉపాధ్యాయులు సాంకేతిక అక్షరాస్యతను విద్యార్థులకు అందించడానికి కృషి చేయాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. 6 నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం డిజిటల్ అక్షరాస్యత బోధనను ప్రారంభించిన నేపథ్యంలో గణితం, ఫిజికల్ సైన్స్ టీచర్లకు సీజేఐటీ ఇంజనీరింగ్ కళాశాలలో డిజిటల్ కంటెంట్‌పై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ మంగళవారం ప్రారంభించారు. కార్యక్రమంలో శిక్షణ సమన్వయకర్త ఏఎంఓ శ్రీనివాస్, డీఎస్‌ఓ ఉపేందర్, డీఆర్‌పీలు శ్రీకాంత్, కృష్ణవేణి, కృష్ణయ్య, మాధవరావు పాల్గొన్నారు.