
బనకచర్లను బాబుకు కట్టబెట్టేందుకే!
జనగామ: బనకచర్ల ప్రాజెక్టును ఏపీ ముఖ్యమంత్రి బాబుకు కట్టబెట్టేందుకే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయనే బూటకపు మాటలతో సీఎం రేవంత్‌రెడ్డి సీబీఐని తెరపైకి తీసుకొచ్చాడని ఏఎంసీ మాజీ చైర్మన్ బాల్దె సిద్ధిలింగం, రైతు సమన్వయ సమితి మాజీ జిల్లా అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి, మాజీ ఎంపీపీ మేకల కలింగరాజు ఆరోపించారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆదేశాల మేరకు బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు తాళ్ల సురేష్‌రెడ్డి అధ్యక్షతన కాళేశ్వరంపై సీబీఐని వ్యతిరేకిస్తూ, రైతులకు యూరియా అందించాలని కోరుతూ సోమవారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి బైక్ ర్యాలీగా ఆర్టీసీ చౌరస్తా వద్దకు చేరుకున్నారు. వరంగల్–హైదరాబాద్ ప్రధాన హైవే జంక్షన్‌లో బైఠాయించి రాస్తారోకో చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు శ్రేణులు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. అంతకుముందు యూరియా కోసం రైతులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ.. దేశంలో సీబీఐపై రాహుల్‌గాంధీ మండిపడుతుంటే, ఇక్కడ మాత్రం రేవంత్‌కు ప్రేమ పెరిగిందన్నారు. రేవంత్, చంద్రబాబు, ప్రధాని మోదీ కుట్రలను ప్రజలు ఖండించి, గోదావరి జలాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్‌ను ముట్టుకుంటే తెలంగాణ సమాజం భగ్గుమంటుందన్నారు. కార్యక్రమంలో నాయకులు పోకల జమునలింగయ్య, గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, ముస్త్యాల దయాకర్, గుర్రం భూలక్ష్మినాగరాజు, ఉల్లెంగుల సందీప్, జూకంటి లక్ష్మిశ్రీశైలం, సేవెల్లి మధు, ఉడుగుల కిష్టయ్య, అనిత, శారత, రేఖ, ఉడుగులు నర్సింహులు, మామిడాల రాజు, సువార్త, రాజు, జాయ శ్రీశైలం, యాకూబ్ తదితరులు ఉన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి బూటకపు మాటలతో
సీబీఐ తెరపైకి
జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్ రాస్తారోకో, ర్యాలీ
సీఎం దిష్టిబొమ్మ దహనానికి యత్నం