
ట్రేడ్ లైసెన్స్‌లు లేని వైన్స్‌కు తాళాలు
స్టేషన్‌ఘన్‌పూర్: నూతనంగా ఏర్పడిన స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ట్రేడ్ లైసెన్స్‌లు లేని వైన్స్‌కు కమిషనర్ ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బంది శనివారం తాళం వేశారు. వివరాలిలా ఉన్నాయి.. నూతన ఆర్థిక సంవత్సరం 2025–26కు గాను ఏప్రిల్ నుంచి మున్సిపాలిటీ నిబంధనల మేరకు మున్సిపాలిటీ పరిధిలో వ్యాపారాలు చేసే యజమానులు తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్స్‌లు తీసుకోవాలని పలుమార్లు మున్సిపల్ అధికారులు సూ చించారు. అయినప్పటికీ స్పందించక పోవడంతో కమిషన్ రాధాకృష్ణ ఆదేశాల మేరకు మున్సిపాలిటీ శానిటరీ ఇన్‌స్పెక్టర్ సందీప్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ సిబ్బంది స్థానిక వైన్‌షాపులకు తాళం వేశారు. దీంతో మున్సిపల్ సిబ్బందికి, వైన్‌షాపుల వారికి వాగ్వాదం జరిగింది. రెండు రోజుల్లో ట్రేడ్ లైసెన్స్‌లు తీసుకుంటామని వైన్‌షాపుల వారు చెప్పడంతో తిరిగి షాపులను తెరిచారు. వ్యాపారాలు చేసేవారు తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్స్‌లు తీసుకోవాల్సిందేనని కమిషనర్ రాధాకృష్ణ స్పష్టం చేశారు.