
‘ఇందిరమ్మ’ నిర్మాణాల్లో ఆదర్శంగా నిలవాలి
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి
జనగామ రూరల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలవాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అ న్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం మాట్లాడుతూ ఫేజ్ 1, 2లో మంజూరు అయిన లబ్ధిదారులు వందశాతం పనులు ప్రారంభించేలా చూడాలన్నారు. బిల్లుల చెల్లింపులో జాప్యం లేకుండా చూడాలని, సాంకేతిక సమస్యలు ఉంటే తక్షణమే పరిష్కరించాలన్నారు. లబ్ధిదారులకు స్థానికంగా ఇసుక, మట్టి తరలించుకోవడానికి రెవెన్యూ, పోలీస్ అధికారులు అనుమతి ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌లు పింకేష్ కుమార్, రోహిత్‌సింగ్, ఆర్డీఓ వెంకన్న, హౌసింగ్ పీడీ మాతృనాయక్, సిద్దార్ధ, కమిషనర్ రామకృష్ణ, ఎంపీడీఓలు, అధికారులు పాల్గొన్నారు.