
శివోహం..
● ఆలయాల్లో శ్రావణ సోమవారం పూజలు
జనగామ: పవిత్రమైన శ్రావణమాసం మొదటి సోమవారం పురస్కరించుకుని జిల్లాలో శివాలయాలు, వైష్ణవ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుల మంత్రోచ్ఛరణల నడుమ అభిషేకాలు, అర్చనలు, పూజా కార్యక్రమాలను చేపట్టారు. చెన్నకేశ్వర ఆలయంలో గోదాదేవి అమ్మవారిని పట్టువస్త్రాలతో అలంకరించి పూజించారు. పాలు, నెయ్యి, తేనె, తులసి, బిల్వ పత్రం, గంగాజలంతో శివ లింగానికి అభిషేకాలు చేశారు. పట్టణంలోని పాతబీటు బజారు రామలింగేశ్వర, చెన్నకేశ్వర, గుండ్లగడ్డ ఉమామహేశ్వర, గీతాశ్రమం, హెడ్ పోస్టాఫీస్ ఏరియా సంతోషిమాత, కన్యకాపరమేశ్వరి, బాణాపురం వేంకటేశ్వర, పాలకుర్తి సోమేశ్వర, కొడవటూరు సిద్ధులగుట్ట, జీడికల్ సీతారామచంద్రస్వామి, చిల్పూరు బుగులోని వేంకటేశ్వర తదితర ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి.