
మహాప్రభో!
వినతులు కొన్ని ఇలా..
● పాలకుర్తి మండలం మంచుప్పుల గ్రామానికి చెందిన ముదిరాజ్ సంఘం నాయకులు గ్రామంలో సొసైటీ చెరువు కబ్జాకు గురైందని, విచారణ చేపట్టి చర్య తీసుకోవాలని విన్నవించారు.
● నర్మెట మండలం బొమ్మకూరు శివారు బోడబండతండాకు చెందిన మూడావత్ శ్రీకాంత్ అనే వ్యక్తికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరారు.
● జనగామ మండలం పెంబర్తి గ్రామానికి చెందిన బండ సత్తయ్య అనే వ్యక్తికి చెందిన భూమిని బండ నర్సయ్య అనే వ్యక్తి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని, విచారణ జరిపి చర్య తీసుకోవాలని వినతిపత్రం అందించారు.
● వివిధ గ్రామాలు, తండాల నుంచి జిల్లా కేంద్రానికి బస్సు సౌకర్యం లేక విద్యార్థులు ఇ బ్బందులు పడుతున్నారని, అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు లవకుమార్ విన్నవించారు.
● సర్వే నంబర్ 280బీ/1లో 2 ఎకరాల భూమి ఉంది. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న. ఆన్‌లైన్‌లో ఫారెస్ట్ భూమి అని చూపిస్తుందని రైతు భరోసా రావడం లేదు. విచారణ చేసి న్యాయం చేయాలని జఫర్‌గఢ్ మండలం సాగరంకు చెందిన మహేందర్ వినతిపత్రం అందించారు.
● దివ్యాంగులకు ప్రభుత్వం అందించే మూడు చక్రాల వాహనాలకు అర్హులనే ఎంపిక చేయా లని తెలంగాణ దివ్యాంగుల వేదిక అధ్యక్షుడు మేకల సమ్మయ్య, బొట్ల సుమతి, దామెర రమేశ్ తదితరులు కలెక్టర్‌ను కోరారు.