
నాణ్యమైన భోజనం అందించాలి
బచ్చన్నపేట: పాఠశాలలు, హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా పంచాయతీ అధికారి నాగపురి స్వరూపారాణి అన్నారు. సోమవారం మండలకేంద్రంలోని ఆదర్శ పాఠశాల బాలికల హాస్టల్‌లోని వంటగది, స్టాక్ రూం, తరగతి గదులను ఆమె పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ వర్షాకాలంలో ఈగలు, దోమల బెడద ఎక్కువగా ఉంటుందని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. తాజా కూరగాయలను వండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎల్‌పీఓ వెంకట్‌రెడ్డి, ఎంపీడీఓ వెంకటమల్లికార్జున్, పంచాయతీ కార్యదర్శి అనిల్‌రాజ్, వార్డెన్ అన్నపూర్ణ, హెడ్‌కుక్ తేలుకంటి విజయ, కవిత, సుశీల, నైట్ వాచ్‌మన్ మౌనిక పాల్గొన్నారు.
మోదీ పాలనలో ఆర్థిక అసమానతలు
జనగామ రూరల్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలతో దేశంలో ఆర్థిక అసమానతలు, పేదరికం, నిరుద్యోగం పెరుగుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. సోమవారం అమరజీవి ఏసీ రెడ్డి నరసింహారెడ్డి 34వ వర్ధంతి సభ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అధ్యక్షతన పట్టణంలోని ఓ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో విఫలమైందన్నారు. ప్రజావ్యతిరేక విధానాలపై రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి పోరాటాలు చేయాలన్నారు. అంతకుముందు నెహ్రూ పార్క్ నుంచి భారీ ర్యాలీ తీశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు, అహల్య, సాంబరాజు యాదగిరి, సింగారపు రమేశ్, బొట్ల శేఖర్, రాపర్తి సోమ య్య, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి పోరాటాలే శరణ్యం
స్టేషన్‌ఘన్‌పూర్: ఐక్య పోరాటాల ద్వారానే ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కా రం అవుతాయని డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇప్ప రాంరెడ్డి అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలో డీటీఎఫ్ సభ్యత్వ నమోదు కోసం మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరిస్తామని పలు హామీలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సదరు సమస్యల పరిష్కారంపై శ్రద్ధ చూపకపోవడం సరికాదన్నారు. సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయులు ఐక్య పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సోమనారాయణ, కార్యదర్శి దూడయ్య, మండల అధ్యక్షుడు సోమరాజు తదితరులు పాల్గొన్నారు.

నాణ్యమైన భోజనం అందించాలి