
టీబీ రహిత జిల్లా కోసం కృషి చేద్దాం
జనగామ: టీబీ రహిత జిల్లా కోసం ప్రతిఒక్కరు కృషి చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా పిలుపునిచ్చారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలోని విజయ ఫంక్షన్ హాల్‌లో ఐఎంఏ సహకారంతో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ చేపట్టిన క్షయ కార్యక్రమంలో టీబీ రోగులకు కలెక్టర్ చేతుల మీదుగా ఉచిత న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గతేడాది 1,051 మంది, ప్రస్తుతం సంవత్సరం ఇప్పటి వరకు 361 మందికి క్షయ వ్యాధిగ్రస్తులుగా గుర్తించారన్నారు. ఈ ఏడాది చివరి నాటికి దేశాన్ని క్షయ వ్యాధి రహిత భారత్‌గా చేసేందుకు టీబీ ముక్త్ భారత్ అభియాన్ ప్రోగ్రాంలో టీబీ సోకే అవకాశం ఉన్న వారికి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. వ్యాధిగ్రస్తులు ఆరు నెలలు పాటు క్రమం తప్పకుండా చికిత్స తీసుకుంటే పూర్తిగా నయం చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జునరావు, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ బాలాజీ, కార్యదర్శి డాక్టర్ శ్రీకాంత్, వైద్యులు రాజమౌళి, లవకు మార్‌రెడ్డి, లక్ష్మినారాయణ, శ్రీనివాస్, శ్యామ్, కమలహాసన్ తదితరులు పాల్గొన్నారు.
యూరియా కొరత సృష్టిస్తే చర్యలు
జనగామ రూరల్: యూరియా కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. సోమవారం మన గ్రోమోర్ ఫర్టిలైజర్ షాపును సందర్శించి స్టాక్ రిజిస్టర్‌ను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని, అనవసరంగా కొరత సృష్టిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అలాగే ఓబుల్ కేశవాపూర్‌లోని పీహెచ్‌సీని సందర్శించి పలు సూచనలు చేవారు. అనంతరం పీహెచ్‌సీ ఆవరణలో వనమహోత్సవంలో భాగంగా మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంబికా సోని, ఎంపీడీఓ, మెడికల్ ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పథకాలు పక్కాగా అమలు చేయాలి
ప్రభుత్వ పథకాలు పక్కాగా అమలు చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. సోమవారం జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాల నేపథ్యంలో మండల స్పెషల్ అధికారులు, వివిధ శాఖలకు చెందిన అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతీ శుక్రవారం స్కూల్‌డేగా పెట్టామ ని స్పెషల్ అధికారులు మండలాల పరిధిలోని పాఠశాలలను, రెసిడెన్షియల్ హాస్టళ్లను పరిశీలించి మె నూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందేలా చూ డాలన్నారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ఆర్డీఓలు, అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ రిజ్వాన్ బాషా
రోగులకు న్యూట్రిషన్ కిట్ల పంపిణీ