
హెచ్‌టీ సర్వీసులకు సింగిల్ విండో సిస్టం
జనగామ: విద్యుత్ వినియోగదారుల సౌకర్యార్థం హెచ్‌టీ 11, 33 కేవీపై ఓల్టేజీ సర్వీసు ల మంజూరు ప్రక్రియలో వేగం పెంచేందుకు సింగిల్ విండో సిస్టం అందుబాటులోకి తెచ్చి నట్లు ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ టి.వేణుమాధవ్ తెలిపారు. శనివారం సర్కిల్ ఆఫీసులో ఆయ న మాట్లాడుతూ.. సర్కిల్, కార్పొరేట్ కార్యాలయాల్లో హెచ్‌టీ మానిటరింగ్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. 11 కేవీ ఓల్టేజీ దరఖాస్తుల ను సర్కిల్ ఆఫీస్ పరిధి ఏడీతో పాటు కమర్షియల్ అధికారి, 33 కేవీ, ఆపై ఓల్టేజీ దరఖాస్తులను ఏడీ, కమర్షియల్ కార్పొరేట్ ఆఫీస్ అధికారి పర్యవేక్షిస్తార ని చెప్పారు. వినియోగదారులు ముందుగా టీజీ ఎన్పీడీసీఎల్ పోర్టల్‌లో అవసరమైన పత్రాలతో హెచ్‌టీ దరఖాస్తు(టీజీ ఐపాస్‌లో నమోదు కానివి) నమోదు చేసుకు న్నాక కొత్త అప్లికేషన్ నంబర్(యూఐడీ) క్రియేట్ అవుతుంద ని, దాని ద్వారా దరఖాస్తు ఎన్పీడీసీఎల్ సర్కిల్ డాష్ బోర్డులో కనిపిస్తుందని పేర్కొన్నారు. రోజువారీ గా ఏడీఈ, కమర్షియల్ అధికారులు డాష్ బోర్డును మానిటరింగ్ చేస్తారని తెలిపారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తి కాగానే ఎస్టీమేషన్ల కోసం పంపిస్తార ని, ఏడీఈ, కమర్షియల్ సర్కిల్ ఆఫీస్ ఫీల్డ్ స్టాఫ్ సందర్శించి ఉన్నతాధికారులకు పంపాక ఓకే అయి తే అనుమతులు జారీ చేస్తారని వివరించారు. అనుమతి సాధ్యం కాకుంటే రెండు రోజుల్లో రిమార్కుతో ఎస్‌ఎంఎస్ పంపిస్తారని చెప్పారు.
ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ వేణుమాధవ్