ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
జనగామ: ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ విద్యుత్ సంస్థకు సహకరించాలని ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ టి.వేణుమాధవ్ అన్నారు. భారీ ఈదురు గాలుల సమయంలో ఇంటి ఆవరణలో ఆరేసిన దుస్తులు ఎగిరి పోయి విద్యుత్ వైర్లపై పడిపోవడం వల్ల కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పాడుతోందని చెప్పారు. విద్యుత్ సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రకృతి వైపరీత్యాలు, ఇతర సాంకేతిక సమస్యలు ఉత్పన్నమైన సయయంలో నాణ్యమైన విద్యుత్ అందించేందుకు శ్రమిస్తున్నారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
విద్యార్థులకు ఉత్తమ విద్య అందించాలి
నర్మెట : ఉపాధ్యాయులు తరగతి గదిలో విద్యార్థులకు ఉత్తమ విద్య అందించాలని విద్యాశాఖ రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ జి.ఉషారాణి అన్నారు. శుక్రవారం వెల్దండ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరంతోపాటు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల పఠనా సామర్థ్యాలను గుర్తించి వారిని కేటగిరీలుగా విభజించి అనుగుణంగా బోధన చేయాలని సూచించారు. గుణాత్మక విద్య అందించి ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రలకు నమ్మకం పెంచాలన్నారు. డీఈఓ భోజన్న, వయోజన విద్య సమన్వయకర్త విజయ్‌కుమార్, ఎంఈఓ అయిలయ్య, క్యాంపు ఇన్‌చార్జ్ అంజిరెడ్డి పాల్గొన్నారు.
ఫైర్ సేఫ్టీ తప్పనిసరి
జనగామ: ఫైర్ సేఫ్టీ తప్పనిసరి.. అగ్ని ప్రమాదా ల నివారణపై అవగాహన కలిగి ఉండాలని డీసీపీ రాజమహేంద్రనాయక్ అన్నారు. పట్టణంలో వరుస అగ్ని ప్రమాదాల నేపథ్యంలో అగ్ని మాపక, పోలీసు శాఖలు సంయుక్తంగా వ్యాపా ర, వాణిజ్య సంస్థల నిర్వాహకులకు శుక్రవారం అవగాహన కల్పించారు. ఏసీపీ నితిన్ చేతన్ పండేరి, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి రేమండ్ బాబు ఆధ్వర్యాన ఆర్టీసీ డిపో, షాపింగ్ మాల్స్, దీపావళి క్రాకర్స్ గోదాం, దుకాణాల వద్ద ఫైర్ సేఫ్టీని పరిశీలించారు. ప్రమాద నివారణ జాగ్రత్తలు, ఫైర్ సేఫ్టీ అనుమతులపై ఆరా తీశారు.
ముస్లింలు చట్టాన్ని అనుసరించాలి
జనగామ రూరల్: ముస్లింలు చట్టాన్ని అనుసరించాలి.. ఆవు, ఆవులలో తక్కువ వయసు కలిగిన వాటిని వధించి బక్రీద్ పండుగ జరుపుకోవద్దని ముస్లిం డెవలప్మెంట్ కమిటీ జిల్లా అధ్యక్షుడు, న్యాయవాది మహమ్మద్ జమాల్ షరీఫ్ కోరారు. శుక్రవారం పట్టణంలోని ఏక్ మినార్ మజీద్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆవు బలి నిషేధ చట్టం అమల్లో ఉన్నందున ముస్లింలు చట్టప్రకారం నడుచుకోవాలని, ఉల్లంఘించిన వారు చట్టప్రకారం శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా బక్రీద్ పండుగ జరుపుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అలీముద్దీన్, అఫ్జల్, అబ్దుల్లా, జహంగీర్, షకీర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి


