
‘ఎల్‌ఆర్‌ఎస్’ ప్రక్రియ త్వరగా పూర్తిచేయాలి
జనగామ రూరల్: ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల ప్రక్రియ త్వరగా పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ అన్నారు. శనివారం మున్సిపల్ కార్యాలయంలో సెక్షన్ అధికారులు, సిబ్బందితో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ పురపాలిక పరిధిలో లేఅవుట్ ప్లాట్ల క్రమబద్ధీకరణ కు ప్రభుత్వం కల్పించిన ఎల్‌ఆర్‌ఎస్–2020 పథకానికి వచ్చిన దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిశీలించి త్వరగా పరిష్కరించాలని చెప్పారు. అలాగే వార్డుల్లో చెత్త సేకరణ, తరలింపు ప్రక్రియ నిత్యం చేపట్టాలని, డ్రెయినేజీలు, రహదారులు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలన్నారు. తడి, పొడి చెత్త సేకరణ మరింత మెరుగ్గా ఉండాలని సూచించారు. పురపాలికకు సంబంధించిన రిజిస్టర్లు, రికార్డులు, ఖాతాల నిర్వహణ సక్రమంగా చేపట్టాల ని ఆదేశించారు. అనంతరం వార్డుల వారీగా నివాస గృహాల నుంచి వసూలు చేసిన పన్నుల వివరాలపై ఆరా తీసిన అదనపు కలెక్టర్.. వంద శాతం వసూళ్లు లక్ష్యంగా ముందుకు వెళ్లాలని అన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ గోపయ్య, ఆర్‌ఓ శ్రీనివాసస్వామి, టీపీఎస్ ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్